యాదాద్రి శిలల వివాదం కొత్త మలుపు

తెలంగాణలోనే అత్యంత పవిత్రమైన దేవాలయంగా పేరు దక్కించుకున్న యాదాద్రి లక్ష్మినరసింహ స్వామి దేవాలయంను పునరుద్దరిస్తున్న విషయం తెల్సిందే.గత నాలుగు సంవత్సరాలుగా ఈ దేవాలయ పనులు జరుగుతున్నాయి.

 Trsgovernament Responding On Yadaddri Issue-TeluguStop.com

మరి కొన్ని రోజుల్లో దేవాలయం పూర్తిగా రెడీ అవ్వబోతుంది.ప్రస్తుతం చివరి దశ పనులు జరుగుతున్నాయి.

ఈ సమయంలోనే దేవాలయంలోని రాతి శిలలపై కేసీఆర్‌ చిత్ర పటం, కారు గుర్తు, ఇంకా కేసీఆర్‌ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పలు పథకాలకు సంబంధించిన బొమ్మలను చిత్రీకరించారు.దాంతో బీజేపీ మరియు ఇతర పార్టీల నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో పాటు ఆందోళనకు దిగారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.

ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి ఈ విషయమై సీరియస్‌ అన్నాడు.

అసలు శిలలపై కేసీఆర్‌ గారి చిత్రపటం మరియు ప్రభుత్వ పథకాలను చిత్రీకరించాల్సిందిగా చెప్పింది ఎవరు అంటూ విచారణకు ఆదేశించారు.వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్దం అయ్యారు.

ప్రభుత్వం పరువు తీసే విధంగా ఇలాంటి పనులు చేసిన వారిపై కఠినంగా ప్రవర్తించాలని కేసీఆర్‌ నుండి ఆదేశాలు అందినట్లుగా సమాచారం అందుతోంది.ప్రస్తుతం ఈ విషయమై విచారణ జరుగుతోంది.

మరో వైపు శిలలపై ఉన్న ఆ గుర్తులను మరియు రాతలను చిత్ర పటాలను తొలగింపు కార్యక్రమం కూడా జరుగుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube