టీ ప్రజలకు శుభవార్త చెప్పిన కేటీఆర్‌

తెలంగాణలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నట్లుగా మంత్రి కేటీఆర్‌ ప్రకటించాడు.తెలంగాణలో ఉన్న వాణిజ్య అనుకూలతల కారణంగా పెద్ద పెద్ద కంపెనీలు మరియు ఫ్యాక్టరీలను తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు వ్యాపారస్తులు ఆసక్తిగా ఉన్నట్లుగా కేటీఆర్‌ తాజాగా జరిగిన ఒక సమావేశంలో చెప్పుకొచ్చారు.

 Trs Working President Ktr Orr-TeluguStop.com

ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం హైదరాబాద్‌ ఒక వాణిజ్య జోన్‌గా మారుతున్నట్లుగా పేర్కొన్నాడు.పరిశ్రమల ఏర్పాటుకు హైదరాబాద్‌ను మించిన మంచి ప్రాంతం లేదంటూ ఆయన పేర్కొన్నాడు.

ప్రస్తుతం ఉన్న పరిశ్రమలతో పాటు త్వరలోనే ఓఆర్‌ఆర్‌ చుట్టు భారీ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా ఈ సందర్బంగా కేసీఆర్‌ అన్నారు.పరిశ్రమలు భారీ ఎత్తున పడటం వల్ల నిరుద్యోగులకు డైరెక్ట్‌గా ఇండైరెక్ట్‌గా ఉద్యోగాలు లభిస్తాయంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

పరిశ్రమలతో తెలంగాణ అభివృద్ది పథంలో దూసుకు పోతుందనే నమ్మకంను ఆయన వ్యక్తం చేశారు.తెలంగాణలో జరుగుతున్న అభివృద్దికి సాక్ష్యం ఎన్నికల ఫలితాలు అంటూ టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు ఆనందంగా చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube