కేటిఆర్ కి లైన్ క్లియర్..?? కేటిఆర్ అనే నేను..!!!  

Trs Working President Ktr Is Next Cm Of Telangana -

తెలంగాణలో కేసీఆర్ కూటమిని మట్టి కరిపించేశారు, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేసింది.నేతలు , కార్యకర్తలు, అందరూ పండుగ చేసుకుంటున్నారు.

Trs Working President Ktr Is Next Cm Of Telangana

టీఆర్ఎస్ వర్గాలు ఎంతో కోలాహలంగా ఉన్న తరుణంలో ఒక్క సారిగా అందరి మెదళ్ళని తొలుస్తున్న వార్త , పార్టీ శ్రేణుల్లో చర్చల్లో నిలుస్తున్న వార్త కేవలం ఒక్కటే సీఎం గా ఎవరిని నిలబెడుతారు.ఇప్పుడు ఇదే చర్చ మీడియా వర్గాలలో సైతం ఊపందుకుని.అందరి అంచనాల ప్రకారం కేటిఆర్ భవిష్యత్తు సీఎం కనిపిస్తారనేది జగమెరిగిన సత్యం అందుకు తగ్గట్టుగానే కేసీఆర్…

పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా అనే “వర్కింగ్‌ ప్రెసిడెంట్‌” గా శుక్రవారం కేటిఆర్ ని ఎంపిక చేశారు.ఈ మేరకు ఈ మేరకు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నిర్ణయం తీసుకోవడంతో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గం సైతం ఆమోదం తెలిపింది.అయితే కేటిఆర్ ముఖ్యమంత్రిగా రావడానికి ఇది ఓం ప్రదంగా భావిస్తున్నాయి పార్టీ వర్గాలు.ఎందుకంటే గతం నుంచీ కూడా కేసీఆర్ తానూ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని , కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తానని చెప్పడం అందరికి తెలిసిందే.

కేటిఆర్ కి లైన్ క్లియర్.. కేటిఆర్ అనే నేను..-Political-Telugu Tollywood Photo Image

అయితే ఈ పరిస్థితులకి అనుగుణంగానే.

తాజాగా , వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలను కలుపుకుని జాతీయ స్థాయిలో కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లుగా కేసీఆర్ ప్రకటన చేశారు.ఈ క్రమంలోనే.తనపై పని ఒత్తిడిని తగ్గించుకోవటానికి కేటీఆర్‌ను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించినట్లు కేసీఆర్‌ చెబుతున్నా, అసలు విషయం మాత్రం కేటిఆర్ ని సీఎం కుర్చీ ఎక్కించడానికేనని రాజకీయ పరిశీలకులు బల్లగుద్ది మరీ చెప్తున్నారు.

మరి భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో త్వరలో తేలిపోనుంది.

తాజా వార్తలు

Trs Working President Ktr Is Next Cm Of Telangana- Related....