కేటీఆర్ చేసిన ఈ పనికి ఎవరైనా శభాష్ అనాల్సిందే !  

Trs Working President Ktr Helping A Poor Man -

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్టయిలే వేరు.ట్రెండింగ్ కి అనుగుణంగా…ఎప్పటికప్పుడు యాక్టివ్ గా వాటిని ఫాలో అవుతుంటారు.

Trs Working President Ktr Helping A Poor Man

తాను ఏది చేసినా అందులో విషయం ఉండడంతో పాటు ….నలుగురు చేత శభాష్ అని అనిపించుకోవాలని కేటీఆర్ ఆరాటపడుతుంటారు.

ఇప్పుడు కూడా ఆ విధంగానే మరో సారి శభాష్ కేటీఆర్ అని అనిపించుకున్నారు.ఇంతకీ విషయం ఏంటో మీకు చెప్పనే లేదు కాదు….?

చిన్నప్పుడు మనం చదువుకునే స్కూల్ దగ్గర … రక రకాల తినుబండారాలు అమ్మేవారు ఉంటారు కదా… మనం ఇంటర్వెల్ లో ఏదో ఒకటి కొనుక్కుని ఆత్రంగా తినే ఉంటాము కదా… ఆ విధంగానే కేటీఆర్ కూడా… తాను చదువుకున్న ….అబిడ్స్‌లోని గ్రామర్ స్కూల్ వద్ద ఐస్ గోళాలు తినేవాడు.అయితే ఇప్పడు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే… తన చదువుకునే స్కూల్‌ వద్ద ఐస్‌ గోలా అమ్మిన వ్యక్తిని ముప్పయేళ్ల తరువాత కేటీఆర్‌ కలుసుకున్నారు.అతనితో ఆప్యాయంగా మాట్లాడి.

నీకు నేనున్న తాతా అంటూ భరోసా ఇచ్చారు.సయ్యద్‌ అలీ అనే వ్యక్తి అప్పట్లో ఆ స్కూలు ముందు ఐస్ గోలా అమ్ముతూ ఉండేవాడు.

అయితే ఇంతకాలం తరువాత సోషల్‌ మీడియా ద్వారా… కేటీఆర్‌ ఆ ఐస్‌ గోలా తాతను కలుసుకున్నారు.రెండు వారాల క్రితం మహబూబ్‌ అలీ అనే యువకుడు ట్విటర్ ద్వారా.”కేటీఆర్ సార్, మీరు స్కూల్లో ఉన్నప్పుడు మీకు ఐస్ గోలా అమ్మిన సయ్యద్ అలీ అనే వ్యక్తి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు” అని ట్వీట్ చేశారు.దీనిని స్పందించిన కేటీఆర్.

తప్పకుండా కలుస్తానని.సయ్యద్ అలీ విషయంలో తనకెన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయని ట్విట్ చేశారు.

దీనిలో భాగంగానే… బేగంపేట లో ఉన్న సీఎం క్యాంపు కార్యాలయానికి సయ్యద్‌ను కేటీఆర్‌ పిలిపించుకున్నారు.ఆప్యాయంగా సయ్యద్‌ను ఆలింగనం చేసుకున్నారు.‘ఇంకా ఐస్‌ అమ్ముతున్నారా? ప్యామిలీ పరిస్థితి ఎలా ఉంది ? మీ పిల్లలు ఏం చేస్తున్నారు.ఆరోగ్యం ఎలా ఉంది’ అంటూ కుసలా ప్రశ్నలు వేశారు.

అయితే దీనికి ఆలీ స్పందించి… తనకు ఆరోగ్యం అంతగా సహకరించడం లేదని, గత సంవత్సరమే ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యిందని, అయినా పూట గడవడం కోసం ఇంకా ఆబిడ్స్ గ్రామర్ స్కూల్ వద్ద ఐస్ గోలాలు అమ్ముతున్నానని చెప్పాడు.అలీకి సొంత ఇల్లు కూడా లేదని తెలుసుకున్న కేటీఆర్‌ తక్షణమే స్పందించి ఇంటితో పాటు వృద్ధాప్య పింఛను మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.

ఆయన కుమారులకు కూడా సరైన ఉపాధి చూపిస్తానని హామీ ఇచ్చారు.అయితే ఈ పరిణామాలు ఊహించని అలీ ఆనందంతో కేటీఆర్ మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు.

తాజా వార్తలు

Trs Working President Ktr Helping A Poor Man- Related....