అప్పుడే కేటీఆర్ పాలన మొదలయ్యిందిగా ?

ఇప్పుడు కాకపోతే మరికొంత కాలానికి అయినా తెలంగాణ సీఎం గా కేసీఆర్ కుమారుడు కేటీఆర్ బాధ్యతలు స్వీకరిస్తారు.ఈ విషయంలో టిఆర్ఎస్ పార్టీ లోనే కాకుండా ప్రజలకు ఓ క్లారిటీ ఉంది.

 Trs Working Party President Ktr Rulling Start In Telangana-TeluguStop.com

ఇప్పటి వరకు పార్టీని, ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకు వెళ్ళిన కేసీఆర్ తన కుమారుడికి తన స్థానాన్ని అప్పగించి జాతీయ రాజకీయాల వైపు వెళ్లాలని చూస్తున్నారు.అయితే ఒక్కసారిగా సీఎం పదవిని కేటీఆర్ కు ఇవ్వకుండా ఇప్పటి నుంచే కేటీఆర్ హవా పార్టీలో పెరిగేలా కెసిఆర్ ప్లాన్ చేశారు.

అందుకే నామినేటెడ్ పదవుల తో పాటు తెలంగాణలో ఉన్న అన్ని పదవులను భర్తీ చేసే విషయంలో తాను జోక్యం చేసుకోకుండా మొత్తం కేటీఆర్ కే అప్పజెప్పారు.

Telugu Kcr, Kcr Son Ktr, Trsktr-Political

సోమవారం జరిగిన కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయం అందరికీ అర్థమైంది.కెసిఆర్ పుట్టినరోజు వేడుకలను ఎవరు ఎప్పుడు ఎలా చేయాలి ఎవరు ఏ విధంగా కలవాలి అనే విషయంపై మొత్తం అన్నీ తానై వ్యవహరించారు.ఇటీవల జరిగిన స్థానిక, మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన వారికి మేయర్లు, కార్పొరేషన్ చైర్మన్లు ,సర్పంచులు, ఎలా అన్ని పదవులు కేటీఆర్ చెప్పిన వారికి మార్త్రమే కేసీఆర్ కట్టబెట్టారు.

దీని వెనుక కెసిఆర్ వ్యూహం క్లియర్ గా కనిపిస్తోంది.క్షేత్ర స్థాయి నుంచి కేటీఆర్ బలం తెలిసొచ్చేలా కేసీఆర్ చేస్తున్నారు.

Telugu Kcr, Kcr Son Ktr, Trsktr-Political

కేటీఆర్ కు సన్నిహితులైన వారు పదవుల్లో ఉండడంవల్ల ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టినా ఎటువంటి ఇబ్బంది లేకుండా కెసిఆర్ ఇప్పటి నుంచే కేటీఆర్ హవా పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ప్రాధాన్యతను పెంచుతున్నారు.ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వ పదవులు, పార్టీ పదవులు ఎవరికి ఇవ్వాలన్నా కేటీఆర్ ఆశీస్సులు ఉంటేనే అది సాధ్యమయ్యేలా కేసీఆర్ చూస్తున్నారు.ఇదంతా భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని కెసిఆర్ తన కుమారుడికి ముందు ముందు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నట్లుగా అర్థం అవుతోంది.ప్రస్తుతం కేటీఆర్ హవాను చూసి అప్పుడే ఆయన పాలన తెలంగాణాలో మొదలయిపోయిందిగా అంటూ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు మొదలయ్యాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube