కోమటిరెడ్డి మెడలో టీఆర్ఎస్ కండువా ..? అసలేమయ్యింది అంటే..?  

Trs Worker Try Put Trs Scarf Komatireddy Venkatareddy-

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ఊహించని అనుభవం ఎదురయ్యింది. నల్లగొండ జిల్లా కేంద్రంలో తన నియోజకవర్గ కేంద్రంలో పాతబస్తీలో కోమటిరెడ్డి పర్యటిస్తుండగా ఓ టీఆర్ఎస్ కార్యకర్త తన జేబులో ఉన్న టీఆర్ఎస్ కండువాను ఆయన మెడలో కప్పేందుకు ప్రయత్నించాడు. దాంతో కంగుతున్న కోమటిరెడ్డి వెంటనే తేరుకొని అతన్ని కండువ కప్పకుండా అడ్డుకున్నారు..

కోమటిరెడ్డి మెడలో టీఆర్ఎస్ కండువా ..? అసలేమయ్యింది అంటే..? -Trs Worker Try Put Trs Scarf Komatireddy Venkatareddy

ఈ ఘటన శనివారం నల్లగొండ పాత బస్తీలోని 36వ వార్డులో జరిగింది. ఈ ఊహించని పరిణామంతో అక్కడ ఉన్న వారంతా అవాక్కయ్యారు. ఈ ఘటనతో సీరియస్ అయిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కండువా కప్పేందుకు యత్నించిన వ్యక్తి టీఆర్ఎస్ కార్యకర్త అని కాంగ్రెస్ నేతలు చెప్పారు.

ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ ఇప్పుడు వైరల్ గా మారింది.