ముందస్తు... విజయోస్తు ! లెక్క తప్పని కేసీఆర్ అంచనా !

సాధారణ ఎన్నికలకు ఇంకా చాలా సమయమే ఉన్నా… ముందస్తు ఎన్నికలకు వెళ్లి కేసీఆర్ చాలా పెద్ద తప్పు చేసాడు…! అసలు ఇంత అత్యవసరంగా ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిని అవసరం ఏంటి.? తెలంగాణాలో మహాకూటమి బలం బాగా పెరిగింది.టీఆర్ఎస్ ఓటమి ఖాయం అనే అనేక కామెంట్స్ మొన్నా… నిన్నటివరకు తెలంగాణాలో వినిపించాయి.అయితే ఆ కామెంట్స్ చేసిన వాళ్ళ నోళ్లు ఇప్పడు మూతపడ్డాయి.కారు పార్టీ స్పీడ్ కి బ్రేకులే లేనట్టుగా అందరి అంచనాలను మించి టీఆర్ఎస్ విజయం వైపు దూసుకుపోయింది.ముందస్తు ఎన్నికల సంగతి ఒక్కసారి చూస్తే… గతంలో అనేకసార్లు అనేక పార్టీలు ముందస్తు ఎన్నికల విషయంలో ముందుకు వెళ్లి బొక్కబోర్లా పడ్డాయి.

 Trs Wins In Telangana For In Early Elections-TeluguStop.com

కేసీఆర్ కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తారని అందరూ లెక్కలు వేసుకున్నారు.కానీ ఆ చరిత్రను ఆయన టీఆర్ఎస్ విజయంతో చెరిపేసారు.

ఉమ్మడి ఏపీలో విజయభాస్కర్‌రెడ్డి, ఎన్టీఆర్, చంద్రబాబు ముందుగానే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లి ఓటమి పాలయిన సంగతి ఇప్పటివరకు అందరూ మాట్లాడుకున్నారు.తెలంగాణ అసెంబ్లీని ముందే రద్దు చేసిన కేసీఆర్‌ అదే బాటలో కాకుండా కొత్త బాట వేసుకుని సరికొత్త విజయాన్ని నమోదు చేసుకున్నారు.తెలంగాణాలో అప్పటికే… అనేక సంక్షేమ పథకాలతో అందరికీ చేరువైన టీఆర్ఎస్ ఆ తరువాత ప్రజలకు ఇచ్చిన హామీలు .కూడా ప్రజలను బాగా ఆకట్టుకున్నాయని అర్ధం అవుతోంది.
అసలు కేసీఆర్ సరైన సమయం చూసుకునే ముందస్తు ఎన్నికలకు వెళ్లారు.అప్పటికే తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకోలేదు.సరిగా అదే సమయంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ద్వారా… కాంగ్రెస్ పార్టీని అన్నివైపుల నుంచి కేసీఆర్ ఉక్కిరిబిక్కిరి చేసేసాడు.

కేసీఆర్ ఇంత అకస్మాత్తుగా .ముందస్తు ఎన్నికలకు వెళ్ళడు భావనలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇలా అకస్మాత్తుగా ఎన్నికలు రావడం… అప్పటికి కాంగ్రెస్ సరిగా సన్నద్ధం కాలేకపోవడం.టీఆర్ఎస్ కి కలిసొచ్చింది.

తాము బలహీనంగా ఉన్నామని ముందే పసిగట్టిన కాంగ్రెస్ పార్టీ… టీడీపీ, టీజేఎస్, సీపీఎం పార్టీలతో ప్రజాకూటమిగా ఏర్పడి సీట్ల సర్దుబాటు చేసుకున్నప్పటికీ … ఫలితం మాత్రం దక్కలేదు.అంతే కాదు కూటమిలో టీడీపీ అధినేత చంద్రబాబు పెత్తనం మరీ ఎక్కువన్నట్టుగా కూడా కనిపించింది.

ఇదే అంశాన్ని టీఆర్ఎస్ ఎన్నికల సభల్లో ప్రస్తావించింది.ఒకవేళ తెలంగాణాలో కూటమి గెలిస్తే అమరావతి నుంచి చంద్రబాబు రిమోట్ కంట్రోల్ తో పాలన చేస్తారని… ఆంధ్రావాళ్ల పెత్తనం మనకు అవసరమా అంటూ చేసిన ప్రసంగాలు కూడా ప్రజల్లో ఆలోచన రేకెత్తించినట్టు అర్ధం అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube