ఏపీ లో టీఆర్ఎస్ విస్తరణ ? 

ఏపీలో టిఆర్ఎస్ పార్టీని విస్తరించే  ఆలోచనలో ఆ పార్టీ అధిష్టానం ఉన్నట్టుగా కనిపిస్తోంది.అందుకే పదేపదే ఏపీ వ్యవహారాల పై స్పందిస్తూ వస్తోంది.

 Trs  Tryentered On Ap Politics Trs, Ap Trs, Telangana, Mim, Ysrcp, Tdp, Jagan, C-TeluguStop.com

ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఏపీ రాజకీయ పార్టీల కంటే టిఆర్ఎస్ పార్టీ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తోంది.అవసరమైతే విశాఖకు వచ్చి మరి పోరాటం చేస్తామంటూ ప్రకటనలు చేస్తోంది.

ఇప్పటికే తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది.రాజకీయ శత్రువులు గతంతో పోలిస్తే బాగా పెరిగిపోయారు.

దీనికితోడు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది.ఈ సమయంలో జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెడితే తెలంగాణలో ఫలితం దెబ్బ కొడుతుంది అనే ఆలోచనతో ఫెడరల్ ఫ్రంట్ ను సైతం కేసీఆర్ పక్కన పెట్టేసారు.

పూర్తిగా తెలంగాణ రాజకీయాలపైనే ఫోకస్ పెట్టారు.ఒకవైపు బిజెపి , మరోవైపు రేవంత్ రాజకీయం తో సతమతమౌతున్న టిఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు కొత్తగా రాబోతున్న షర్మిల పార్టీ తోనూ ఇబ్బందులు తప్పేలా కనిపించకపోవడం మరింత టెన్షన్ పెడుతోంది.

అప్పుడే షర్మిల తమ పార్టీని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తుండడంతో సతమతమవుతున్న టిఆర్ఎస్ అధిష్టానం పెద్దలు, సతమతం అవుతున్నట్లు తెలుస్తుంది.అందుకే స్టీల్ ప్లాంట్ ను అస్త్రంగా చేసుకుని , ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టి అక్కడ వచ్చిన రెస్పాన్స్ ఆధారంగా పార్టీని విస్తరించాలని , అంతకుముందే దీనికి సంబంధించి ఒక సర్వే నిర్వహించి, పార్టీ ఏర్పాటు చేస్తే ఎంత వరకు సక్సెస్ అవుతాము అనే విషయం పైన ఆరా తీస్తున్నట్లు సమాచారం.

అసలు టిఆర్ఎస్ పార్టీ ఏపీలో అడుగు పెట్టాలనే ఆలోచన ఇప్పటిది కాదు.ఎప్పుడో ఈ ఆలోచన చేసినా, పరిస్థితులు అనుకూలించకపోవడంతో సైలెంట్ అయిపోయారు.ఇక ఇప్పుడు షర్మిల తెలంగాణలో దూకుడుగా ముందుకు వెళ్ళకుండా, ఏపీలో రాజకీయం నడపాలని చూస్తున్నారట.

Telugu @ministerktr, Chandrababu, Telangana, Trs Ap, Vizag Steel-Telugu Politica

 ఏపీ సీఎం జగన్ తమకు మిత్రుడు అయినా, రాజకీయం రాజకీయమే అన్నట్లుగా ఇప్పుడు టిఆర్ఎస్ వ్యవహరించాలని నిర్ణయించుకుంది.మున్సిపల్ ఎన్నికల సమయంలో జగన్ కు, టిఆర్ఎస్ కు  మిత్రుడైన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఏపీకి వచ్చి మరి ప్రచారం నిర్వహించారు.మజ్లిస్ అభ్యర్థులు సైతం పోటీకి దిగారు.

ఇప్పుడు ఏపీలో స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నా, ఏపీలోని రాజకీయ పార్టీలు కేంద్ర బిజెపి పెద్దల ఆగ్రహానికి గురి అవుతాము అనే ఆందోళనతో  సైలెంట్ అయిపోయాయి.దీంతో ఈ పరిస్థితులను ఉపయోగించుకుని ఇప్పుడు ఏపీ లో ఎంట్రీ ఇచ్చేందుకు, ప్రజల్లో ఉన్న సెంటిమెంట్ ను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం లో టీఆర్ఎస్ ఉందట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube