వరంగల్ ఉప ఎన్నిక లో టీ.ఆరె.స్ విజయం..?

వరంగల్ లోక్ సభ నియోజకవర్గం ఉప ఎన్నికకు ఎవ్వరూ నామినేషన్లు వేయకముందే, ఏ పార్టీ కూడా అభ్యర్థులను నిర్ణయించక ముందే కారు పార్టీ గెలిచింది.విచిత్రం ఏమిటంటే దాని ఓట్ల శాతం కూడా నిర్ణయం జరిగింది.

 Trs To Win Warangal By-poll With 57% Votes?-TeluguStop.com

ఉప ఎన్నికలో కారు పార్టీ గెలవడమే కాకుండా, దానికి 57 శాతం ఓట్లు పోల్ అవుతాయని లెక్క కట్టాడు ఓ నాయకుడు.ఆయన టీఆరెస్ ఎమ్మెల్సీ రాజేశ్వర రెడ్డి.

వివిధ స్వతంత్ర సంస్థలు చేసిన సర్వేల్లో కారు పార్టీ గెలుస్తుందని, ఇంత శాతం ఓట్లు పడతాయని తేలిందట.కెసీఆర్ పరిపాలనకు 82 శాతం మంది ప్రజలు అనుకూలంగా ఉన్నారని సర్వేలో తేలిందట.

ఆయన పథకాలను ప్రజలు మెచ్చుకుంటున్నారట.ప్రతిపక్షాలకు ఇప్పటివరకు అభ్యర్థి దొరకలేదని ఎద్దేవా చేశారు.

గులాబీ పార్టీకి కూడా దొరకలేదు కదా.ఆ విషయం ఆయనకు తెలియదా? 25 మంది నాయకులు గులాబీ పార్టీ టిక్కెట్ కోసం ఎగబడుతున్నారని రాజేశ్వర్ రెడ్డి చెప్పారు.ఉప ఎన్నికలో పోటీ చేయడానికి టీడీపీకి ముఖం లేదని విమర్శించారు.వరంగల్ సీటు మిత్ర పక్షమైన భాజపాకు వదిలి పెట్టినప్పుడు టీడీపీ ఎలా పోటీ చేస్తుంది? అది పోటీ చేయడానికి సనత్ నగర్ ఉంది కదా.అప్పుడే ముఖం లేదని విమర్శించడం ఎందుకు?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube