టీవీ9.ఈ చానల్ పేరు చెబితే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది రవి ప్రకాష్.టీవీ9 రవి ప్రకాష్ గా గుర్తింపు తెచ్చినా, ఆ చానల్ టాప్ పొజషన్ లో నిలిపేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించి సక్సెస్ అయ్యారు.నెంబర్ వన్ చానల్ గా తీర్చిదిద్దారు.
అయితే ఆ తర్వాత జరిగిన అనూహ్య పరిణామాల నేపథ్యంలో. టిఆర్ఎస్ రాజకీయ నేపథ్యం ఉన్న మైహోం రాజేశ్వరరావు ఆ చానల్ ను సొంతం చేసుకోవడం, ఆ తర్వాత కొన్ని సంఘటనల తర్వాత రవిప్రకాష్ ను ఆ చానల్ నుంచి బయటకు సాగనంపడం వంటి వ్యవహారాలు ఎన్నో చోటుచేసుకున్నాయి.
ఇక అప్పటి నుంచి పెద్దగా రవి ప్రకాష్ పేరు వార్తల్లో వినిపించలేదు.అయితే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో రవి ప్రకాష్ పేరు గట్టిగా వినిపిస్తోంది.ఆయన ఎక్కడా ఏ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.కనీసం ఏ పార్టీ తరఫున ప్రచారానికి దిగడం లేదు.
అయినా ఆయన పేరు తెరపైకి రావడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి.ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి ఊహించని అంత స్థాయిలో పాపులారిటీ వచ్చింది .టిఆర్ఎస్ ను బలంగా ఢీకొట్టే అంత స్థాయికి బీజేపీ ఎదిగింది.అంతేకాదు దుబ్బాకలో విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇప్పుడు గ్రేటర్ మేయర్ పీఠాన్ని సైతం దక్కించుకునే అంత స్థాయిలో బీజేపీ బలం పెంచుకుంది.అయితే ఒక్కసారిగా ఆ పార్టీకి ఊపు రావడానికి ప్రధాన కారణం టీవీ 9 మాజీ సీఈఓ రవి ప్రకాష్ అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
పూర్తిగా ఆయనే వెనకుండి తెలంగాణ బీజేపీ ని ముందుకు నడిపిస్తున్నారనే ప్రచారం కొద్ది రోజులుగా వస్తోంది. దీనికితోడు ఆ న్యూస్ ఛానల్ లో బీజేపీకి అనుకూలంంగా, టిఆర్ఎస్ కు వ్యతిరేకం గా కథనాలు వస్తున్న వ్యవహారాల వెనుక ఉన్నారనే చర్చ జరుగుతోంది.ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది, వ్యతిరేక కథనాలుు, వ్యూహాలతో టిఆర్ఎస్ తీవ్ర ఇబ్బందికర పరిణామాలను ఎదుర్కొంటోంది.బిజేపి ఎత్తులను, పై ఎత్తులను అందుకోలేక టిఆర్ఎస్ పార్టీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
తాను టీవీ9 వదిలి బయటకు వచ్చేందుకు తనపై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం వెనుక , టిఆర్ఎస్ పెద్దల హస్తం ఉందని భావిస్తున్న టిఆర్ఎస్ దెబ్బతీసేందుకు ఈ విధంగా బీజేపీతో చేతులు కలిపి , పూర్తిగా తమను టార్గెట్ చేసుకున్నారని టిఆర్ఎస్ కాస్త కంగారు పడుతున్నట్లు సమాచారం.