ఎడిటోరియల్ :  గ్రేటర్ పీఠంపై గులాబీ జెండా ! శభాష్ కేసీఆర్ 

తెలంగాణలో హోరాహోరీగా జరిగిన గ్రేటర్ ఎన్నికల సందడి నేటితో ముగిసింది.ఎన్నికల ఫలితాలు పూర్తిగా,  బయటకు రానప్పటికీ టిఆర్ఎస్ 44, బిజెపి 28, ఎంఐఎం 39 స్థానాల్లో గెలుపొందాయి.

 Trs Winning On Ghmc Elections, Trs, Telangana Cm Kcr, True Leader, Bjp Campaign,-TeluguStop.com

ఒక్కొక్కటిగా ఎన్నికల ఫలితాలు విడుదల అవుతుండటంతో తుది ఫలితం వెలువడే వరకు అన్ని పార్టీలు టెన్షన్ ఎదురుచూస్తున్నాయి.ఏది ఏమైనా టిఆర్ఎస్ జెండా ఎగరవేయడం ఖాయం అనే విషయం తేలిపోయింది.

ముఖ్యంగా టిఆర్ఎస్, బిజెపిల మధ్య హోరాహోరీగా సాగిన పోరులో టిఆర్ఎస్ గెలిచిన నేపథ్యంలో ఆ పార్టీని విజయతీరాలకు వైపు నడిపించిన ఘనత తెలంగాణ సీఎం, టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు దక్కుతుంది.ఎందుకంటే బిజెపి గెలుపు ఖాతాలో వేసుకునేందుకు పడిన కష్టం అంతా ఇంతా కాదు.
 బిజెపి జాతీయ నాయకులు అంతా గ్రేటర్ పీఠం కోసం పడిన కష్టం అంతా ఇంత కాదు.దుబ్బాక ఉప ఎన్నికలలో బీజేపీకి గెలుపు దక్కడంతో, ఉత్సాహంతో గ్రేటర్ పీఠాన్ని సాధిస్తామని ధీమా ఆ పార్టీ నేతల్లో స్పష్టంగా కనిపించింది.

అందుకే ఎక్కువగా బిజెపి జాతీయ నాయకులు ఎన్నికలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు.ప్రధాని నరేంద్ర మోడీ సైతం గ్రేటర్ లో పెట్టారు.ఎన్నికల ప్రచారానికి బిజెపి జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులు , ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ , మరెంతో మంది ప్రముఖులు గ్రేటర్ లో బిజెపి విజయం కోసం పని చేశారు.అసలు గ్రేటర్ ఎన్నికల స్థాయిని మించి, పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో ఎన్నికల ప్రచారం జరిగింది .గ్రేటర్ పీఠాన్ని తమ పార్టీకి ఇస్తే ఏమేమి చేయబోతున్నాము అనే విషయాన్ని అన్ని పార్టీలు గొప్పగా చెప్పుకుంటూ,  ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించాయి.

Telugu Bandi Sanjay, Bjp, Dubbaka, Greater, Telangana, Trs Win Ghmc, Trs Ghmc, T

ఒక దశలో బిజెపి గ్రేటర్ పీఠాన్ని తన్నుకుపోతుంది అని అంతా  ఓ రేంజ్ లో హడావుడి నడిచింది.మొదటి నుంచి ధీమాగా ఉంటూ వచ్చిన కెసిఆర్ బిజెపి హడావుడిని  ఎక్కడా లెక్క చేయకుండా గ్రేటర్ లో పని చేసుకుంటూ వెళ్లారు.గ్రేటర్ లో బిజెపికి విజయాన్ని తీసుకువచ్చే విధంగా పక్కా ప్రణాళికలు రచించారు.

ఎమ్మెల్యేలు , ఎంపీలు ఇలా అందరినీ ప్రచారంలోకి దింపి డివిజన్ బాధ్యతలు అప్పగించడం, పార్టీ శ్రేణులను ఎన్నికల ప్రచారంలో నిమగ్నం చేయడం, ఎక్కడా ఎటువంటి అసంతృప్తులు పార్టీలో చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవడం వంటి వ్యవహారాలను దగ్గరుండి చూసుకున్నారు.గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ కు ఎంత ప్రతిష్ఠాత్మకం.

మంత్రి కేటీఆర్ కు అంతే ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ భావించారు.

Telugu Bandi Sanjay, Bjp, Dubbaka, Greater, Telangana, Trs Win Ghmc, Trs Ghmc, T

రానున్న రోజుల్లో ఆయన తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాలి అంటే గ్రేటర్ ఎన్నికలు కొలమానం కాబోతున్న నేపథ్యంలో, చాలా జాగ్రత్తగా టిఆర్ఎస్ అడుగులు వేసి గ్రేటర్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పక్కా ప్లాన్ తో టిఆర్ఎస్ బిజెపి ని ఎదుర్కొంది.అయితే బిజెపి ముఖ్యంగా సెంటిమెంట్ రాజేసి హిందుత్వం ద్వారా గ్రేటర్ లో సత్తా చాటాలి అని చూసినా, ఓటర్లు ఆ రాజకీయానికి ఒప్పుకోలేదు అన్నట్లుగానే ఫలితాలు వెలువడ్డాయి.ఎంఐఎం పార్టీ కి దక్కిన సీట్లను లెక్కలోకి తీసుకుంటే ,ఈ విషయం అర్థమవుతుంది.

ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే, మొదటి నుంచి ఊహించినట్టుగానే, ఆ పార్టీ ప్రభావం అంతంత మాత్రం అనే విషయం తేలిపోయింది.తెలంగాణలో కాంగ్రెస్ ఉనికి పై ఇప్పుడు సందేహాలు వస్తున్నాయి.

Telugu Bandi Sanjay, Bjp, Dubbaka, Greater, Telangana, Trs Win Ghmc, Trs Ghmc, T

పూర్తి ఎన్నికల ఫలితాలు వెలువడినా, గ్రేటర్ మేయర్ పీఠం టీఆర్ఎస్ దే అనే విషయం తేలిపోవడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తుండగా, బిజెపి సైతం గతంతో పోలిస్తే బలం పుంజుకున్నాము అనే సంతృప్తితో ఉంది.ఏది ఏమైనా తెలంగాణలో ఎప్పటిలాగే గులాబీ జెండా ఎగురవేసి, టీఆర్ఎస్ కు ,కేసీఆర్ కు సాటిలేదు అనే విషయాన్ని నిరూపించడం లో కేసీఆర్ సక్సెస్ అయ్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube