ఈటెలే లక్ష్యంగా హరీష్ రాజకీయం ? ఆ మంత్రులకూ బాధ్యతలు ?

టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే పదవికీ  రాజీనామా చేశారు.ఇది ఆమోదం పొందితే ఉప ఎన్నికలు వస్తాయని టీఆర్ఎస్ భావిస్తోంది.

 Trs Target On Etela Rajender Party Resign Issue, Trs, Kcr, Ktr, Telangana, Bjp,-TeluguStop.com

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో , ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడం, ఎన్నికల తంతు ముగియడం ఇలా అన్ని స్పీడ్ గా జరిగిపోతాయని ఆ పార్టీ భావిస్తోంది.అయితే అంతకంటే ముందుగానే హుజూరాబాద్ నియోజకవర్గం లో ఈటెల రాజేందర్ ను ఒంటరి చేయాలని, టిఆర్ఎస్ నాయకులు ఎవరూ ఆయన వెంట వెళ్లకుండా చూడడంతో పాటు,  ఎక్కడికక్కడ ఆయనకు చెక్ పెట్టే విధంగా చేయాలనే లక్ష్యంతో టిఆర్ఎస్ ఉంది.

ఈటెల రాజేందర్ పార్టీకి , పదవికి రాజీనామా చేసింది ఆయన అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకు, అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు అనే విషయాన్ని టిఆర్ఎస్ హైలెట్ చేయాలని చూస్తోంది.ఈ బాధ్యతలను మంత్రి హరీష్ రావు తీసుకున్నారట.

ఆయనతో పాటు మంత్రి గంగుల కమలాకర్ , మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మరికొంత మంది మంత్రులు ఈ బాధ్యతలను కెసిఆర్ కు అప్పగించినట్లు తెలుస్తోంది.తాజాగా ఓ వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు వెళ్ళిన మంత్రి హరీష్ రావు,  గంగుల కమలాకర్ ఇద్దరూ ఏకాంతంగా ఈటెల రాజేందర్ వ్యవహారంపై చర్చించుకున్నారు.
  ఈనెల 11 12 తేదీల్లో హుజూరాబాద్ నియోజకవర్గం లో పర్యటించి టిఆర్ఎస్ నేతలు ఎవరు ఈటెల వైపు వెళ్లకుండా చూడాలనే లక్ష్యంతో మంత్రులు రంగంలోకి దిగారు.

Telugu Etela Bjp, Etela Trs, Hareesh Rao, Itela Rajandar, Telangana, Trs-Telugu

అలాగే మాజీ మంత్రి బస్వరాజు సారయ్య కుల సంఘాల నాయకులతో భేటీ అవుతూ ఈటెల కు చెక్ పెట్టే విధంగా వ్యవహారాలు మొదలుపెట్టారు.ఈ వ్యవహారాలన్నీ చూస్తుంటే ఈ విషయాన్ని ఎంత సీరియస్ గా టిఆర్ఎస్ పార్టీ తీసుకుంటుందో అర్థం అవుతోంది.వరుసగా అన్ని ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్న రాజేందర్ ను ఈ ఎన్నికల్లో ఓడించి రాజేందర్ కు టీఆర్ఎస్ పార్టీ బలం తప్ప,  సొంత బలం లేదు అనే విషయాన్ని నిరూపించేందుకు కెసిఆర్ తో పాటు మిగిలిన మంత్రులు రాజకీయ వ్యూహాలు రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube