ఆ బిగ్‌బాస్ కంటెస్టెంట్‌కు టీఆర్ఎస్ స‌పోర్ట్‌...!

తెలంగాణ‌లో దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రిగే ఉప ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ త్వ‌రలోనే రానుంది.న‌వంబ‌ర్ 29వ తేదీ లోగా ఈ ఎన్నిక ప్ర‌క్రియ పూర్తి చేస్తామ‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది.

 Trs Support For Bigg Boss Cotestat,kathi Karthika,bigg Boss 3,contestant,politic-TeluguStop.com

దీంతో ఈ ఉప ఎన్నిక‌ల్లో అన్ని ప్ర‌ధాన పార్టీలు పోటీకి రెడీ అవుతున్నాయి.గ‌తంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఖేడ్‌, పాలేరులో మృతి చెందిన‌ప్పుడు టీఆర్ఎస్ సంప్ర‌దాయం విస్మ‌రించి త‌మ పార్టీ అభ్య‌ర్థుల‌ను పోటీలో పెట్టింది.

ఆ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ అభ్య‌ర్థులే విజ‌యం సాధించారు.దీంతో ఇప్పుడు దుబ్బాక ఉప ఎన్నిక‌ల్లోనూ కాంగ్రెస్ పోటీ చేయ‌నుంది.

ఇక బీజేపీ నుంచి గ‌తంలో ఇక్క‌డ ఆ పార్టీ త‌ర‌పున రెండుసార్లు పోటీ చేసిన ర‌ఘునంద‌న్‌రావు రంగంలో ఉండ‌నున్నారు.ఇక ప‌లువురు ఇండిపెండెంట్లు కూడా పోటీ చేస్తున్నారు.

వీరిలో బిగ్‌బాస్ 1 ఫేం, ప్ర‌ముఖ యాంక‌ర్ క‌త్తి కార్తీక కూడా రంగంలో ఉండ‌డంతో దుబ్బాక రాజ‌కీయం ఆస‌క్తిగా మారింది.కొద్ది రోజులుగా క‌త్తి కార్తీక ఎన్నిక‌ల ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు.

క‌త్తి కార్తీక తెలంగాణ మాజీ మంత్రి, ప్ర‌స్తుత డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద్మారావుకు స‌మీప బంధువు.

ఆమె ఎన్నిక‌ల బ‌రిలో ఉండ‌డం వెన‌క ఓ ఆస‌క్తికర చ‌ర్చ కూడా స్టార్ట్ అయ్యింది.

ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ, ప్ర‌మ‌ఖ సినీన‌టి విజ‌య‌శాంతి బ‌రిలో ఉండ‌వ‌చ్చ‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి.విజ‌య‌శాంతి సినీ గ్లామ‌ర్ ఉప‌యోగించి టీఆర్ఎస్‌కు గ‌ట్టి పోటీ ఇవ్వాల‌న్న‌దే కాంగ్రెస్ ప్లాన్‌.

విజ‌య‌శాంతి గ‌తంలో మెద‌క్ ఎంపీగా ఉన్నారు.ఇక గ‌త రెండుసార్లు మెద‌క్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.

ఈ క్ర‌మంలోనే దుబ్బాక బ‌రిలో ఆమె ఉంటే అన్ని విధాలా ప్ల‌స్ అవుతుంద‌ని.గెలుపు ఎలా ఉన్నా గట్టి పోటీ ఉంటుంద‌ని టీ కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే విజ‌య‌శాంతి సినీ గ్లామ‌ర్‌కు చెక్ పెట్టేందుకే టీఆర్ఎస్‌లో కొంద‌రు పెద్ద‌లు క‌త్తి కార్తీక‌ను రంగంలోకి దించుతున్నార‌న్న టాక్ వినిపిస్తోంది.మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత నిజం ఉందో గాని… రేపు ఎన్నిల ప్ర‌చారం ఊపందుకున్నాక కార్తీక వెన‌క ఎవ‌రు ఉన్నారో ?  తెలుస్తుంద‌ని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube