ఈటెలకు చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్ బలమైన వ్యూహాత్మక ఎత్తుగడ

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ వ్యవహారం టీఆర్ఎస్ కు పెద్ద గుడిబండలా మారిందని చెప్పవచ్చు.అసైన్డ్ భూముల విచారణ తరువాత టీఆర్ఎస్- ఈటెల మధ్య మాటల తూటాలు పేలినా ప్రస్తుతం వీరిరువురి మధ్య నిశ్శబ్ద వాతావరణం నెలకొంది.

 Trs Strong Strategic Move To Put Check On Etela, Trs Party, Etela Rajender, Kcr,-TeluguStop.com

ఇప్పటికే ఈటెల రకరకాల నాయకులతో భేటీ అవుతూ రాజకీయ వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నాడు.అయితే ఈటెల వ్యూహాలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమై ఉండగా, టీఆర్ఎస్ మాత్రం హుజూరాబాద్ లో ఈటెలకు పూర్తి స్థాయి చెక్ పెట్టాలని భావిస్తోంది.

అయితే ఇప్పటికే కెప్టెన్ లక్ష్మీ కాంతారావుకు హుజురాబాద్ పై గట్టి పట్టు ఉండగా, వీణవంక మండలం టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తుండగా, టీఆర్ఎస్ ముఖ్య అనుచరుడిగా పేరున్న పరిపాటి రవీందర్ రెడ్డి కూడా ఈటెల వైపు కాకుండా టీఆర్ఎస్ లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు.ఇలా ఈటెల ముఖ్య అనుచరులను టీఆర్ఎస్ వైపు తిప్పుకొని ఈటెలను ఒంటరి చేసి బలహీనమైన నాయకుడిగా చిత్రీకరించడమే టీఆర్ఎస్ బలమైన వ్యూహ రచన చేస్తోంది.

త్వరలో కేటీఆర్ హుజురాబాద్ లో పర్యటించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో హుజురాబాద్ నియోజకవర్గం వైపు అందరి చూపు మల్లిందని మనం చెప్పుకోవచ్చు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube