రేవంత్ కోసం వంద కోట్లు ఖర్చు చేస్తున్న టీఆర్ఎస్..?  

Trs Spent 100 Cr For Revanth Reddy For Defeat Him-

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్… ఫైర్ బ్రాండ్ నాయకుడు రేవంత్ రెడ్డి కోసం టీఆర్ఎస్ ఏకంగా వంద కోట్లు ఖర్చుపెట్టేందుకు సిద్ధం అయ్యిందట. ప్రస్తుతం తెలంగాణాలో కేసీఆర్ ని ఢీ కొట్టే స్థాయి కలిగిన నాయకులూ ఎవరూ కనిపించడం లేదు ఒక్క రేవంత్ తప్ప. అందుకే రేవంత్ గురించి టీఆర్ఎస్ అంతగా ఆలోచిస్తోంది. ఆయన హవా తగ్గించడానికి..

రేవంత్ కోసం వంద కోట్లు ఖర్చు చేస్తున్న టీఆర్ఎస్..? -TRS Spent 100 Cr For Revanth Reddy For Defeat Him

టీఆర్ఎస్ కి ఎదురు లేకుండా చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ ను అన్నిరకాలుగా ఇబ్బంది పెట్టేందుకు ఇప్పటికే ఐటీ దాడులతో ఇరకాటంలో పెట్టె ప్రయత్నం చేశాడు. అయినా సరే జైలుకు పంపినా నామినేషన్ వేస్తానన్న రేవంత్ అదే స్థాయిలో టీఆర్ఎస్ పై కేసీఆర్ పై మాటల తూటాలు పేల్చుతున్నారు తప్ప ఎక్కడా వెనకడుగు వెయ్యడంలేదు.

కానీ … రేవంత్ ను టార్గెట్ చేసుకున్న కేసీఆర్ అక్కడ రేవంత్ పై పోటీకి నరేందర్ రెడ్డి ని రంగంలోకి దించారు. రేవంత్ ని ఓడించటానికి వంద కోట్ల డీల్ చేసుకున్నట్టు ప్రచారం జరిగింది. రేవంత్ రెడ్డి మహాకూటమి నుండి కనిపిస్తున్న సీఎం అభ్యర్థి కావటంతో మొదట నుండి ఆయన టార్గెట్ గా కేసీఆర్ రకరకాల కుట్రలు చేస్తున్నారన్న విషయం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ వంద కోట్ల డీల్ గురించి కూడా తెలంగాణలో పెద్ద చర్చే నడుస్తోంది.

కానీ ఈ విషయాన్ని నరేందరరెడ్డి ఒప్పుకోవడం లేదు ఇవన్నీ గాలి వార్తలు అంటున్నారు. .

రేవంత్ కు కొడంగల్ కంచుకోట . అక్కడి నుంచే రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఇమేజ్ సంపాదించుకున్న రేవంత్ రెడ్డిని ఎలాగైనా సరే ఓడించాలని కేసీఆర్ పంతం పెట్ట్టుకున్న.

ఇప్పటికే టీఆర్ఎస్ తరపున కొడంగల్ టికెట్ ని మంత్రి మహేందర్ రెడ్డి సోదరుడు నరేందర్ రెడ్డి కి కేటాయించింది.నరేందర్ రెడ్డి కూడా రేవంత్ కి గట్టి పోటీ ఇచ్చేందుకు గట్టిగానే ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని నరేందర్‌రెడ్డి ధీమాగా ఉన్నారు..

రేవంత్ ఓటమే ధ్యేయంగా ఎన్ని కోట్లయినా కుమ్మరించేందుకు టీఆర్ఎస్ సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ వంద కోట్ల డీల్ వ్యవహారం పెద్ద హాట్ టాఫిక్ గా మారింది.