పదవుల ఆశల పల్లకిలో టీఆర్ఎస్ సీనియర్లు ? కేసీఆర్ మాత్రం ... ?

ఒకపక్క తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ హుజురాబాద్ ఎన్నికల విషయమై చాలా టెన్షన్ పడుతూనే ఉంది.పూర్తి దృష్టి అంతా ఎన్నికలపైనే పెట్టింది.

 Trs, Telangana, Kcr, Ktr, Hujurabad, Elections, Koushik Reddy, Mlc Posts, Gutta-TeluguStop.com

అక్కడ ప్రధాన అభ్యర్థిగా ఉన్న బీజేపీకి చెందిన ఈటల రాజేందర్ ను ఓడించడమే ఏకైక లక్ష్యంగా పని చేస్తోంది.ఈ ఎన్నికల తంతు ముగిస్తే కానీ, టిఆర్ఎస్ పెద్దలు రిలాక్ అయ్యే పరిస్థితి లేదు అయితే ఆ సమయం ఎప్పుడు వస్తున్నా అని కాచుకు కూర్చున్నారు టిఆర్ఎస్ సీనియర్ నేతలు.

ఎందుకంటే ఈ ఎన్నికల పూర్తి అయితేనే తమకు పదవులు వస్తాయనే ఆశలో వారంతా ఉన్నారు.తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఎప్పుడో జరగాల్సి ఉంది.

మొత్తం ఆరు స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది.ఈ ఆరు స్థానాలు టిఆర్ఎస్ కు మాత్రమే దక్కుతాయి.

దీంతో ఆ పదవులను దక్కించుకునేందుకు తెలంగాణ సీనియర్ నాయకుల మధ్య చాలాకాలం నుంచి పోటీ ఉంది.కరోనా తదితర కారణంతో ఎన్నికల కమిషన్ వాయిదా వేస్తూ వస్తోంది.

హుజురాబాద్ ఎన్నికలు ముగిసిన అనంతరం నవంబర్ మొదటి లేదా రెండో వారంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడబోతున్నట్టు సమాచారం.

దీంతో ఆరు ఎమ్మెల్సీ స్థానాలలో కెసిఆర్ ఎవరిని ఎంపిక చేస్తారు అనే టెన్షన్ పార్టీ నాయకుల్లో నెలకొంది.

ఇప్పటికే కొంత మందికి కేసీఆర్ హామీ కూడా ఇచ్చారు.అయితే మరో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో సామాజిక వర్గాలు సమతూకం పాటించి పదవులను భర్తీ చేయాలని చూస్తున్నారు.

ఇప్పటికే ఈ పదవులు పార్టీ సీనియర్లు గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, కర్నె ప్రభాకర్, మధుసూదనాచారి, తుమ్మల నాగేశ్వరరావు వంటి వారు చాలామంది పోటీపడుతున్నారు.

Telugu Guttasukendar, Hujurabad, Koushik Reddy, Madusudanachari, Mlc, Telangana-

వీరంతా కేసీఆర్ కు స్నేహితులు కావడంతో తమకే ఆ పదవులు దక్కుతాయని ఆశలు పెట్టుకున్నారు.హుజురాబాద్ ఎన్నికల నేపథ్యంలో ఊహించని విధంగా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన కౌశిక్ రెడ్డి కి ఎమ్మెల్సీ పదవి గవర్నర్  కోటా ద్వారా ఎంపిక చేసేందుకు ప్రయత్నించారు.అయితే అది వాయిదా పడింది.

అకస్మాత్తుగా కౌశిక్ రెడ్డి వంటి నేతలను కేసీఆర్ తెరమీదకు తీసుకువస్తే, తమకు ఎమ్మెల్సీ పదవి దక్కడం కష్టమనే అభిప్రాయం సీనియర్ నేతల్లో ఉంది.దీంతో కేసీఆర్ ఈ విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube