బీజేపీ మిషన్-12 పై టీఆర్ఎస్ సెటైర్ లు ... రణం మొదలైనట్టేనా

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలతో రసవత్తరంగా మారుతున్నాయి.ఇంకా వచ్చే సార్వత్రిక ఎన్నికలకు రెండున్నర సంవత్సరాలు మాత్రమే ఉండటంతో పార్టీలన్నీ అనధికారికంగా ఎన్నికల సమరంపై దృష్టి సారించిన విషయం తెలిసిందే.

 Trs Satires On Bjp Mission-12 ... Whether The War Has Begun/telangana Politics,-TeluguStop.com

అయితే ప్రస్తుతం బీజేపీ మాత్రమే అధికారికంగా ఎస్సీ రిజర్వ్డ్  స్థానాల్లో గెలుపొందడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.అయితే ఈ అంశంపై ఇప్పటికే సమావేశాలు నిర్వహించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం బీజేపీ ప్రకటించిన మిషన్-12 వ్యూహంపై టీఆర్ఎస్ సెటైర్ లు వేస్తోంది.కనీసం మిషన్ -12 పై బీజేపీ ప్రకటించిన సమావేశంలో ఒక్క దళిత నాయకుడు లేడని, అక్కడ దరిదాపుల్లో కూడా అంబేద్కర్ ఫోటో కనబడటం లేదని, ఎస్సీ, ఎస్టీలకు బీజేపీ చేసిన ప్రయోజనం ఏంటో చెబితే విని తరిస్తామని టీఆర్ఎస్ నేతలు వ్యంగ్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు.

అయితే టీఆర్ఎస్ నేతల విమర్శలపై బీజేపీ నేతలు ఇంకా స్పందించకపోయినప్పటికీదీనిపై రానున్న రోజుల్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య తీవ్ర స్థాయిలో రగడ కొనసాగే అవకాశం కనిపిస్తోంది.అయితే రాష్ట్రంలో ఇంకా పది శాతం నియోజకవర్గాలలో కూడా బీజేపీకి బలమైన కార్యకర్తల నిర్మాణం అనేది లేదు.

ఇంకా బలమైన కార్యకర్తల నిర్మాణం జరగాలంటే ఇంకో ఐదారేళ్లు పట్టినా ఆశ్చర్యపోనక్కరలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Bandi Sanjay, Telangana, Trs, Ts Poltics-Political

అయితే బీజేపీ మాత్రం తెలంగాణ ప్రజలు స్పష్టమైన మార్పును కోరుకుంటున్నారని బీజేపీ ప్రభుత్వం కొరకు వేచి చూస్తున్నారని వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి ఉంది.టీఆర్ఎస్ కూడా అదే రకమైన నమ్మకంతో ఎక్కడో గతం కంటే మెరుగైన స్థానాలు రాకున్నా మరల అధికారంలోకి వస్తామన్న భావన మాత్రం అంతర్గతంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది.మరి బీజేపీ మిషన్-12 వ్యూహం సఫలమవుతుందా లేక కేవలం పార్టీ బలం మాత్రమే పెరిగేందుకు ఈ వ్యూహం దోహదపడుతుందా అనేది చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube