కాంగ్రెస్ తో దోస్తీ చేయాలనీ టీఆర్ఎస్ అనుకుంటోందా ?  

Trs Plan To Friendship With Congress-

రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు.అప్పటి వరకు మిత్రులుగా ఉన్నవారే శత్రువులుగా మారిపోతారు.శత్రువులు గా ఉన్నవారు అప్పటికప్పుడు మిత్రులుగా మారిపోతుంటారు.రాజకీయాల్లో ఇవన్నీ ఊహించే పరిణామాలే.ఇప్పుడు ఇదే పరిస్థితి తెలంగాణాలో త్వరలో కనిపించే అవకాశం ఉన్నట్టుగా రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి.తెలంగాణలో బలమైన పార్టీగా తమను తాము నిరూపించుకునేందుకు టీఆర్ఎస్ పార్టీ తమ ప్రత్యర్థి పార్టీలను బలహీనం చేసింది.

Trs Plan To Friendship With Congress--TRS Plan To Friendship With Congress-

ఇప్పటికే టీడీపీ దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి రాగా, కాంగ్రెస్ పార్టీ కూడా అదే బాటలో ఉంది.కాంగ్రెస్ సీఎల్పీని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసేసుకున్నారు.ఇక కాంగ్రెస్ పని అయిపోయిందని, తమను ఢీ కొట్టే వారే లేరని అనుకుంటుండగా బీజేపీ అనుకోని శత్రువుగా మారిపోయింది.

Trs Plan To Friendship With Congress--TRS Plan To Friendship With Congress-

గతంలో తెలంగాణాలో ఉండి లేనట్టుగా ఉన్న బీజేపీ తెలంగాణాలో బాగా బలపడింది.ఆ విషయం ఈ మధ్య జరిగిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తేలిపోయింది.ఎవరూ ఊహించని విధంగా నాలుగు ఎంపీ సీట్లు గెల్చుకుని బీజేపీ అనూహ్యంగా తెరమీదికి వచ్చింది.ఓరకంగా, కాంగ్రెస్ ను నిర్వీర్యం చేసి ఆ స్థానంలో బీజేపీ బాగా బలపడేందుకు కావాల్సిన దారిని కేసీఆర్ తయారు చేసి పెట్టినట్టే కనిపిస్తోంది.

ఇప్పుడా ఆ దారిని బీజేపీ చక్కగా వాడుకుంటూ బలపడడమే కాకుండా టీఆర్ఎస్ కు ప్రత్యామ్న్యాయంగా తామే కావాలనే పట్టుదలతో ఉన్నారు.కేంద్రంలో అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానం ఖాళీ ఉంది.దీంతో ఇక్కడ బలపడేందుకు బీజేపీ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది.రాబోయే రోజుల్లో తెలంగాణాలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనేది తప్పదని టీఆర్ఎస్ పెద్దలకు అర్ధం అయిపోయింది.

కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో ధీ కొట్టడం అంత ఆషామాషీ కాదు అన్న విషయం కూడా వీరికి బాగా అర్ధం అయ్యింది.

రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా ఉంటేనే తమకు బాగుండేదని, కానీ ఇప్పుడా పరిస్థితి లేకుండా మనమే చేశాం కదా అనే భావన ఈ మధ్య కొంతమంది టీఆర్ఎస్ పెద్దల్లో మొదలయినట్టు తెలుస్తోంది.ఈ సందర్భంగా ఓ ప్రతిపాదన తెరమీదకు వచ్చిందట.టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పనిచేస్తే తప్పేముంది.గతంలో కూడా చేశాయి కదా! తెలంగాణలో బీజేపీ మరింత బలపడితే కాంగ్రెస్ కి గడ్డు పరిస్థితే వస్తుంది కదా అటువంటప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి ముందుకు సాగితే బాగుంటుందేమో అనే ప్రతిపాదన తెరమీదికి వస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే దీనిపై పార్టీలో ఇప్పుడు సుదీర్ఘ చర్చ జరుగుతోందట.మరికొద్ది రోజుల్లోనే దీనిపై ఏదైనా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది.