టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందుగా ఊహించినట్టుగానే ఫలితాలు ఆ పార్టీకి అనుకూలంగా వస్తున్నాయి.కేసీఆర్ అనేక సర్వేలు నిర్వహించి మరీ ముందస్తుకు వెళ్ళాడు కానీ ఆ తరువాత పరిస్థితులు కొంచెం ఆ పార్టీ కి అనుకూలంగా లేనట్టుగా కనిపించాయి.
ఆ సమయంలో టీఆర్ఎస్ వ్యతిరేక పార్టీలన్నీ కూటమి కట్టడం తో అంతా టీఆర్ఎస్ పని అయిపొయింది అనుకున్నారు.
కానీ కేసీఆర్ లో మాత్రం గెలుపు ధీమా మాత్రం పోలేదు.అయితే ఈ రోజు కౌంటింగ్ లో వస్తున్న ఫలితాలు టీఆర్ఎస్ కి ఊహించని రీతిలో ఆనందాన్ని కలిగిస్తున్నాయి.కనీసం కూటమి టీఆర్ఎస్ దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం.
ప్రస్తుతం తెరాస 84 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ప్రజా కూటమి 14, భాజపా, 5, మజ్లిస్ 3, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
తాజా వార్తలు