'కారు'ని మార్చేస్తున్న టీఆర్ఎస్ !  

  • కారు పార్టీగా పేరుపొందిన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఆ కారు కే రిపేర్లు మొదలుపెట్టింది. మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కారు గుర్తుని పోలిన మరో గుర్తు కారణంగా… మెజార్టీ ఓట్లను కోల్పోయింది. దీనిపై ఎన్నికల తరువాత ఆరాతీసిన ఆ పార్టీ మరోసారి ఆ పొరపాటు జరగకుండా… ముందస్తుగా కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిసి ఫిర్యాదు కూడా చేసింది. మొన్న జరిగిన ఎన్నికల్లో 30 స్థానాల్లో సమాజ్‌ వాదీ ఫార్వర్డ్‌ బ్లాక్‌‌ పార్టీ ట్రక్కు గుర్తుతో పోటి చేసింది. ఆ పార్టీ అభ్యర్థులు బరిలో లేని చోట ఇండిపెండెంట్లు ట్రక్కు గుర్తుపై పోటీ చేసి భారీ ఓట్లు పొందారు. ట్రక్కు, కారు ఒకేలా ఉండటంతో టీఆర్ఎస్‌కు నష్టం వాటిల్లిందని కేసీఆర్ డిసెంబర్లోనే ఈసీకి ఫిర్యాదు చేశారు.

  • Trs Party Submits New Version Of Car Symbol To Election Commission-

    Trs Party Submits New Version Of Car Symbol To Election Commission

  • రెండు గుర్తుల మధ్య తేడాను గుర్తించడంలో వృద్ధులు, కంటి సమస్య ఉన్నవారు ఇబ్బంది పడ్డారని టీఆర్ఎస్ నేతలు తెలిపారు. దీంతో కారు గుర్తులో మార్పులు చేయాలని, దాన్ని పోలిన ట్రక్కు గుర్తు, ఇతర గుర్తులను ఎవరికీ కేటాయించొద్దని కోరారు. టీఆర్ఎస్ నేతల ఫిర్యాదుపై ఈసీ స్పందించింది. మార్పులు చేసిన కారు సింబల్‌ను అందజేయాలని కోరింది. దీంతో ఎంపీ వినోద్‌ శుక్రవారం సరికొత్త కారు సింబల్‌ను ఎన్నికల సంఘానికి సమర్పించారు.