కేసీఆర్ కారులో కవితకు సీటు లేనట్టే ?  

The TRS party is debating whether kavitha is likely to become a minister, TRS Party, TRS Party Senior Leader, Telangana CM KCR, Dubbaka Constituency, Greater Hyderabad elections, Kavitha - Telugu Dubbaka Constituency, Greater Hyderabad Elections, Kavitha, Telangana Cm Kcr, The Trs Party Is Debating Whether Kavitha Is Likely To Become A Minister, Trs Party, Trs Party Senior Leader

తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ వ్యూహాలు ఒక పట్టాన ఎవరికి అర్థం కావు.ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా, అంతిమంగా పార్టీకి తనకు మేలు జరిగే విధంగా ఉంటుంది.

TeluguStop.com - Trs Party Senior Leaders Kavitha Minister Post

ప్రస్తుతం కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు వెళ్లేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.అయితే మరోవైపు తెలంగాణలో పరిస్థితులు టిఆర్ఎస్ కు కాస్త ప్రతికూలంగా ఉండడంతో, ఇక్కడ పట్టు జారిపోకుండా కేసీఆర్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

మరోవైపు తెలంగాణ సీఎంగా తన కుమారుడు మంత్రి కేటీఆర్ ను నియమించాలని కేసీఆర్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికే కేటీఆర్ పార్టీలోను, ప్రభుత్వంలోను యాక్టివ్ గా ఉంటూ, టిఆర్ఎస్ ప్రతిష్టను మరింత పెంచుతూ వస్తున్నారు.

TeluguStop.com - కేసీఆర్ కారులో కవితకు సీటు లేనట్టే -Political-Telugu Tollywood Photo Image

దుబ్బాక నియోజక వర్గంలో ఉప ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత, కేటీఆర్ కు పట్టాభిషేకం తప్పదనే వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.ఇదిలా ఉంటే, పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి ఓటమి చెందిన తన కుమార్తె కల్వకుంట్ల కవిత కు నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించి, ఆమెను కేసీఆర్ గెలిపించుకున్నారు.

అయితే త్వరలోనే ఢిల్లీ రాజకీయాల వైపు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టుగా ఏర్పాట్లు చేసుకుంటున్న కేసీఆర్, కవితకు కీలకమైన మంత్రి పదవిని కట్ట పెడతారని, అందుకే ఆమెను ఎమ్మెల్సీగా గెలిపించారు అని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతూ వస్తోంది.

కవిత కూడా మంత్రి అవ్వాలని తహతహలాడుతున్నారు.అందుకోసమే రాజ్య సభకు వెళ్లకుండా, ఎమ్మెల్సీగా టికెట్ సంపాదించి గెలిచారని ప్రచారం జరుగుతోంది.కానీ టిఆర్ఎస్ సీనియర్ నేతలు మాత్రం కవిత కు మంత్రి పదవి వచ్చే ఛాన్స్ లేదని, ఒకవేళ కవితకు అవకాశం కల్పించాలని  చూస్తే, ప్రస్తుత మంత్రుల్లో ఎవరో ఒకరిని తప్పనిసరిగా తప్పించాలని, ఇప్పటికే మంత్రివర్గంలో 17 మంది ఉండాల్సి ఉండగా ఆ కోట పూర్తయిందని, ఇప్పట్లో కేసీఆర్ మంత్రిమండలి విస్తరించే అవకాశం లేదని పార్టీ కీలక నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే కవితకు మంత్రి పదవి ఇవ్వకపోతే ఆమెకు కేబినెట్ స్థాయి ఏదో ఒక పదవిని కట్టబెడతారు అనే ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది.ఏది ఏమైనా కవితకు మంత్రి పదవి వచ్చినా, రాకపోయినా మంచి ప్రాధాన్యం ఉండే పోస్ట్ ఇచ్చే విధంగానే కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు.

#TRSParty #Kavitha #Trs Party #TheTRS

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Trs Party Senior Leaders Kavitha Minister Post Related Telugu News,Photos/Pics,Images..