కాంగ్రెస్ కు కీలక సూచనలు ఇస్తున్న ఆ పార్టీ నేతలు... అవేంటంటే?

తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి ప్రస్తుతం తెలంగాణలో ఎలా ఉందో మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు.వారంతట వారే కాంగ్రెస్ పార్టీని దిగజార్చుకున్న పరిస్థితి ఉంది.

 Trs Party Leaders Who Are Giving Key Instructions To The Congress , Congress Par-TeluguStop.com

కాంగ్రెస్ నేతల మధ్య ఐక్యత లేకపోవడం, ఒకరిపై ఒకరికి ఆధిపత్య పోరు, తమ స్వంత ప్రయోజనాల కోసం పార్టీని సైతం ఇబ్బంది పెట్టే చర్యలకు పాల్పడడం, ప్రజా సమస్యలపై పోరాడటాన్ని గాలికొదిలేసే లాంటి చర్యలతో కాంగ్రెస్ పరిస్థితి ఇటీవలే కొద్దిగా బలపడ్డ బీజేపీ స్థాయి కంటే దిగజారింది.అయితే కాంగ్రెస్ వరుస ఓటములను చవి చూస్తూనే ఉన్న విషయం తెలిసిందే.

అయితే కాంగ్రెస్ ఎన్ని రకాల వ్యూహాలు వేసినా కాంగ్రెస్ మాత్రం ఎన్నికలలో గెలవడం చాలా గగనమైన పరిస్థితి ఉంది.అయితే కొంత మంది టీఆర్ఎస్ నేతలు అంతర్గతంగా కాంగ్రెస్ కొన్ని సూచనలు అందజేస్తున్నారట.

ప్రజల్లో దూకుడుగా వ్యవహరించే నేతలకు అధికార ప్రతినిధులుగా అవకాశాలు ఇవ్వాలని, అప్పుడు కాంగ్రెస్ వాయిస్ మీడియాలో ప్రచారం అవుతూ ఉంటుందని, తద్వారా కాంగ్రెస్ ఉనికి అనేది కొనసాగుతూ ఉంటుందని, తద్వారా కాంగ్రెస్ కార్యకర్తలకు బూస్ట్ వచ్చే అవకాశం ఉందని, క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ నాయకులకు సలహాలు ఇస్తున్నారట.అయితే కాంగ్రెస్ కు ఇక కార్పొరేషన్ ఎన్నికలు చావోరేవో అన్న చందంగా మారాయి.

ఈ ఎన్నికల్లో కొంత మేర అయినా సత్తా చాటకపోతే ఇక కాంగ్రెస్ ను తిరిగి నిలబెట్టడానికి చాలా కష్టపడాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube