నిన్నటితో జిహెచ్ఎంసి ఎలెక్షన్స్ పోలింగ్ తంతు ముగిసింది.ఈసారి వోటింగ్ శాతం చూసినట్లు అయితే చాలా తక్కువగా నమోదు అయింది.
దాంతో అన్నీ రాజకీయ పార్టీలు గెలుపు ఓటమిలపై అంచనాలు వేసుకుంటున్నారు.మరి కొద్ది రోజుల్లోనే రిజల్ట్స్ రానున్నాయి.
హైదరాబాద్ లో ఓటింగ్ శాంతం ఎప్పుడు తక్కువగానే ఉంటుంది.ఈసారి చాలా తక్కువగా పోలింగ్ నమోదు అయ్యింది.
దానికి కారణం కూడా లేకపోలేదు కరోనా కారణంగ బయటకు రావాలంటే జనాలు బయపడుతున్నారు.వరసగా సెలవుల ప్రభావం కూడా పడింది.
తక్కువ ఓటింగ్ నమోదు అవ్వడంతో పలు రాజకీయ పార్టీలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.ఇంత తక్కువ పోలింగ్ నమోదు కావడం ఇదే మొదటిసారి తక్కువ పోలింగ్ అధికార పార్టీ కి కలిసి వచ్చే అంశం అనే చెప్పాలి.హైదరాబాద్ పోలింగ్ శాతం పై కొండ విశ్వేశ్వరయ ట్విటర్ ద్వారా స్పందించారు.పోలింగ్ కు ముందు రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహించిన, వేలకు వేలు డబ్బులు పంచిన, కరపత్రాలను పంచిన వేళల్లో ఫ్లెక్సిలు చుట్టిన ఇంత తక్కువ ఓటింగ్ నమోదు అవ్వడం తనకే ఆశ్చర్యం కలిగించిందని అన్నారు.
ఎక్కువ శాతం ఓటింగ్ పోలింగ్ నమోదు అయితే అది అధికార పార్టీకి మైనస్ గా మారేదని అభిప్రాయం వ్యక్తం చేశాడు.అదే విదంగా తక్కువ ఓటింగ్ తో ఏదైనా జరగవచ్చు అంటున్నాడు.
హైదరాబాద్ లో పోలింగ్ శాతం తగ్గడంపై టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.