ఈ వ్యూహం ఫలిస్తే నాగార్జున సాగర్ స్థానం ఇక టీఆర్ఎస్ కే

తెలంగాణలో ఎంతో ఉత్కంఠను కలిగిస్తున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నగారా మోగింది.వరుసగా జరుగుతున్న ఉప ఎన్నికలు కాకుండా అధికార, ప్రతిపక్షాల బలాబలాలను ప్రదర్శించుకునే ఓ అవకాశంగా దీనిని మలుచుకుంటున్నాయి.

 Trs Political Strategy Behind Nagarjuna Sagar By Electionsm Nagarjuna Sagar By E-TeluguStop.com

అయితే ఇప్పటికే దుబ్బాకలో, గ్రేటర్ లో ఓడిపోయి దెబ్బతిన్న టీఆర్ఎస్ నాగార్జున సాగర్ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.అయితే నాగార్జున సాగర్ టీఆర్ఎస్ టికెట్ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుటుంబానికి కాకుండా, వేరే సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ ఇచ్చే ఆలోచనలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే నోముల నర్సింహయ్య పనితీరుపై ప్రజలలో వ్యతిరేకత ఉన్న సమయంలో వారి కుటుంబానికి ఇస్తే మరల ఫలితం తారుమారయ్యే అవకాశం ఉంది.ఒక వేళ సానుభూతి ఎమన్నా ఫలిస్తుందా అంటే దుబ్బాకలో సానుభూతిని కొంత నమ్ముకున్నా అది అక్కడ ఏమాత్రం పనిచేయక పోవడంతో ఆ ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది.

అయితే టీఆర్ఎస్ అక్కడ యాదవ్ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించినట్లయితే టీఆర్ఎస్ కు కొంత మేర లాభమయ్యే అవకాశం ఉంది.కాని బీజేపీ కూడా రాష్ట్రంలో బలాన్ని కలిగి ఉండడంతో టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.

ఏది ఏమైనా నాగార్జున సాగర్ ఎన్నికలో గట్టిగా ప్రయత్నిస్తే టీఆర్ఎస్ కు ఎక్కువ అవకాశాలు ఉండగా, టీఆర్ఎస్ పై వ్యతిరేకతను ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్తే బీజేపీ కి కూడా ఎక్కువ ఛాన్స్ లు ఉన్నాయి.మరి నాగార్జున సాగర్ ఎన్నికలో ఏ పార్టీ సత్తా చాటుతుందనేది చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube