ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్  

telangana, TRS, mla, carona positive, tandoor, hyderabad - Telugu Carona Positive, Hyderabad, Mla, Tandoor, Telangana, Trs

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు శరవేగంగా వ్యాప్తి చెందుతున్నాయి.రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.

 Trs Mlas Corona Positive Telangana

ప్రజలతో సహా పార్టీ నాయకుల్లో కరోనా భయం పట్టుకొచ్చింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా కరోనా బారిన పడుతున్నాయి.

నిన్న ఒకేరోజు ఏకంగా ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ వచ్చింది. తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు శనివారం డాక్టర్లు వెల్లడించారు.

ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్-General-Telugu-Telugu Tollywood Photo Image

గత కొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన కరోనా పరీక్షలు నిర్వహించుకున్నారు.రిపోర్టులో పాజిటివ్ రావడంతో హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని అపోలో ఆస్పత్రిలో జాయిన్ అయి కోవిడ్ వార్డులో చికిత్స పొందుతున్నారు.

టీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేకు పాజిటివ్ వచ్చింది.ఎల్బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి, ఆయన భార్య, పిల్లలకు కరోనా పాజిటివ్ వచ్చింది.

ఈ మేరుకు వాళ్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.మంత్రి మల్లారెడ్డికి కూడా కరోనా ఉన్నట్లు శనివారమే నిర్ధారించారు.

దీంతో టీఆర్ఎస్ పార్టీలో కరోనా పాగా వేసింది.వరసగా ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడుతుండటంతో పార్టీ కార్యకర్తలు, అనుచరులు భయాందోళనకు గురవుతున్నారు.తెలంగాణలో శుక్రవారం ఒక్కరోజే 2,256 కేసులు నమోదు కాగా, 1091 మంది డిశ్చార్జి అయ్యారు.14 మంది మరణించగా.ఆ సంఖ్య 615కు చేరింది.

#Carona Positive #Telangana #Tandoor #Hyderabad

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Trs Mlas Corona Positive Telangana Related Telugu News,Photos/Pics,Images..