కేటీఆర్ ను సీఎం చేయాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే విజ్ఞప్తి

రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి పగ్గాలు ఎవరికి దక్కుతాయని విమర్శలు వినిపిస్తూనే ఉన్నారు.చాలా మంది నాయకులు.

 Nizamabad, Mla, Kcr, Ktr, Cm-TeluguStop.com

పార్టీ మంత్రులు సీఎం కేసీఆర్ తనయుడు మంత్రి కల్వకుంట్ల తారకరామారావును సీఎం పగ్గాలు అప్పగిస్తారనే చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది.రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి అపోజిషన్ పార్టీ బలోపేతంగా లేకపోవడంతో చాలా మంది నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ తర్వాత సీఎంగా మంత్రి కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలని అభిప్రాయపడుతున్నారు.

ఈ చర్చలు తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికల తర్వాత మరింత ఊపందుకున్నాయి.రాజకీయాల్లో మార్పు లేనప్పటికి.

జరిగినా అది కేటీఆర్ ను సీఎం కావాలని కోరుకునే వారి సంఖ్యే అధికంగా ఉంది.

ఈ మేరకు 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

పార్టీ కార్యాలయంలో జెండాను ఎగురవేసి అనంతరం ఆయన మాట్లాడారు.టీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు, డైనమిక్ లీడర్ అయిన మంత్రి కల్వకుంట్ల రామారావును సీఎం చేయాలని షకీల్ కోరాడు.

పురపాలక శాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రిగా తన విధులను నిర్వర్తిస్తూ ప్రజల చేత మన్నన పొందారని, సీఎంకు కావాల్సిన అన్ని లక్షణాలు ప్రస్తుతం మంత్రి కేటీఆర్ లో ఉన్నాయి.దయచేసి కేటీఆర్ ను సీఎం చేయండి అంటూ సీఎం కేసీఆర్ ను కోరాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube