సమ్మె చేయిస్తున్నది మా పార్టీ వాళ్లే  

Trs Mla Muthi Reddy Comments On Rtc Strike, Behind In Trs Party-muthi Reddy,somany Parties Behind To Run In Rtc Strike,telangana Rtc Strike,trs Mla Muthi Reddy Comments On Rtc Strike

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రతరం అయ్యింది.టీఆర్‌ఎస్‌ పార్టీమినహా రాష్ట్రంలోని అన్ని పార్టీలు మరియు ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఇలా అంతా కూడా ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలుపుతున్నారు.ఆర్టీసీ కార్మికులు తమ ఉద్యోగాలను స్వచ్చందంగా వదిలేసినట్లుగా పరిగణిస్తున్నాం అంటూ సీఎం కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో ఈ సమ్మె మరింత ఉదృతం అయ్యింది.

Trs Mla Muthi Reddy Comments On Rtc Strike, Behind In Trs Party-muthi Reddy,somany Parties Behind To Run In Rtc Strike,telangana Rtc Strike,trs Mla Muthi Reddy Comments On Rtc Strike-TRS MLA Muthi Reddy Comments On RTC Strike Behind In Party-Muthi Somany Parties To Run Rtc Telangana Trs Mla

కొందరు రాజకీయ శక్తులు ఈ సమ్మెను నడిపిస్తున్నారు అంటూ మొదటి నుండి ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.ఇలాంటి సమయంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు.ఆర్టీసీ కార్మికులు ఈస్థాయిలో సమ్మె చేయడానికి ప్రధాన కారణం మా పార్టీ వారే అన్నాడు.

Trs Mla Muthi Reddy Comments On Rtc Strike, Behind In Trs Party-muthi Reddy,somany Parties Behind To Run In Rtc Strike,telangana Rtc Strike,trs Mla Muthi Reddy Comments On Rtc Strike-TRS MLA Muthi Reddy Comments On RTC Strike Behind In Party-Muthi Somany Parties To Run Rtc Telangana Trs Mla

టీఆర్‌ఎస్‌కు చెందిన వారే ఆర్టీసీ కార్మికులతో సమ్మె చేయిస్తున్నట్లుగా ముత్తిరెడ్డి ఆరోపించాడు.వారు ఎవరు, ఎందుకు సమ్మె చేయిస్తున్నారు అనే విషయాలను సీఎం కేసీఆర్‌ వద్ద మాట్లాడుతానంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి.అసలు టీఆర్‌ఎస్‌ నాయకులకు ఎవరికి ఆర్టీసీ కార్మికులతో సమ్మె చేయించాల్సిన అవసరం ఉందని కొందరు ఆలోచిస్తున్నారు.

మొత్తానికి ముత్తిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి.ఈ విషయమై కేసీఆర్‌ ఎలా స్పందిస్తాడు అనేది కూడా చూడాలి.