పరీక్షలు రాస్తున్న తెలంగాణ ఎమ్మెల్యే !  

ఒక పక్క ఎమ్యెల్యేగా బిజీగా ఉంటూనే … మరోపక్క విద్యార్థిగా కూడా బిజీ బిజీ అయిపోయాడు తెలంగాణ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఆయన ప్రస్తుతం రెండో సారి ఎమ్మెల్యేగా …. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి గెలుపొందారు. ఆయన న్యాయశాస్త్రం లో పార్టీక్షలకు హాజరవుతున్నారు. హన్మకొండలోని సుభేధారి లోని యూనివర్సిటీ కాలేజీ ఆఫ్‌ లాలో పరీక్షలు రాశారు.

Trs Mla Jeevan Reddy Write A Law Exams-

Trs Mla Jeevan Reddy Write A Law Exams

హన్మకొండలోని ఆదర్శ్‌ లా కాలేజీలో జీవన్‌రెడ్డి ఎల్‌ఎల్‌ఎం అభ్యసిస్తున్నారు. అయితే ఆయన ప్రస్తుతం మూడో సెమిస్టర్‌ పరీక్షలకు హాజరవుతున్నారు. గత ఏడాది రెండు సెమిస్టర్‌ పరీక్షలు రాసి పాసయ్యానని, ఈ రోజు మూడో సెమిస్టర్‌ పరీక్షలకు హాజరయ్యాను అంటూ… జీవన్ రెడ్డి చెబుతున్నారు.