రైతు కాళ్లు పట్టుకున్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే.. ఎందుకో తెలిస్తే శభాష్ అంటారు.. !

నేటి నాయకులు రాబంధుల్లా మారి రాజ్యం ఏలుతున్న రాజకీయాల్లో, మానవత్వం, మంచితనం ఉన్న వారు చాలా అరుదుగా కనిపిస్తారు.ఇక నిజమైన శ్రామికుడికి అర్ధం రైతు అని చెప్పవచ్చూ.

 Trs Mla Holding Farmer Legs, Mahabubabad, Amangal, Mala, Shankar Nayak-TeluguStop.com

సెలవులు ఉండవు.నెల జీతం ఉండదు.అన్ని షిఫ్టులు చేసే ఒకే ఒక మనిషి రైతు.తనను ఎవరు పట్టించుకోకపోయినా తాను మాత్రం రాత్రి పగలు శ్రమిస్తూనే ఉంటాడు.

అలాంటి రైతుకి సరైన గుర్తింపు నేడు లభిస్తుందా అంటే లేదని ఖచ్చితంగా చెప్పవచ్చూ.

రైతే లేకుంటే మానవ మనుగడ అసాధ్యం.

ఇకపోతే ఒక ఎమ్మెల్యే రైతు కాళ్లు మొక్కి ఎంత ఎత్తుకు ఎదిగినా మానవత్వం ముందు మోకరిల్లడం తప్పుకాదని చాటిచెప్పారు.మహబూబాబాద్ జిల్లా ఆమనగల్‌లో చోటు చేసుకున్న ఈ సంఘటన గురించి తెలుసుకుంటే.

ఆమనగల్‌లో ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణానికి ప్రభుత్వ స్థలం అందుబాటులో లేదు.ఆ విషయం తెలుసుకున్న రైతు వద్ది సుదర్శన రెడ్డి ఊరి జనం బాగు కోసం స్థలం ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.

లాభం లేనిదే పిల్లికి కూడా మెతుకు పెట్టని వారున్న ఈ రోజుల్లో ఏకంగా 30 లక్షల రూపాయల విలువచేసే సుమారు 24 గుంటల భూమిని ఆరోగ్య కేంద్రానికి ఇచ్చేశారు.ఇక ఈ నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి మానుకోట ఎమ్మెల్యే శంకర్ నాయక్ హాజరై, ఆ రైతు దాతృత్వాన్ని చూసి ముచ్చటేసి, మనిషి రూపంలో ఉన్న నిలువెత్తు మానవత్వానికి కాళ్ల మీదపడి పాదాభివందనం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube