పదవుల కోసం పడిగాపులు ! కేసీఆర్ ఎవరిని కనికరించేనో ..?     2019-01-11   15:31:13  IST  Sai Mallula

తెలంగాణలో మరోసారి అధికారం దక్కించుకున్న టిఆర్ఎస్ పార్టీ వరుస వరుసగా వస్తున్న ఎన్నికలను ఎదుర్కోవడానికి సమయం అంతా కేటాయిస్తోంది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది.. అలాగే సహకార ఎన్నికలు కూడా నిర్వహించబోతున్నారు.

TRS MLAs Eagerly Waiting For KCR Cabinet-Kcr Cabinet Ktr Panchayathi Elections Date Revanth Reddy Telangana Meating Congress Trs Mlas Utham Kumar

TRS MLAs Eagerly Waiting For KCR Cabinet

ఇవన్నీ చాలవన్నట్టు సరిగ్గా ఇదే సమయంలో శాసన మండలి ఎన్నికలు కూడా దగ్గరకు వచ్చేస్తుండడంతో టీఆర్ఎస్ పార్టీలో ఎక్కడలేని సందడి మొదలయ్యింది. ఈ నేపథ్యంలో … ఈ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికార టిఆర్ఎస్ పార్టీ కసరత్తులు చేస్తోంది. తెలంగాణలో ప్రస్తుతం 12 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి.

TRS MLAs Eagerly Waiting For KCR Cabinet-Kcr Cabinet Ktr Panchayathi Elections Date Revanth Reddy Telangana Meating Congress Trs Mlas Utham Kumar

ఆ స్థానాలను తమకు కేటాయిస్తారని ఆశతో… పార్టీలోని సీనియర్లు, మొన్నటి ఎన్నికల్లో సీటు దక్కకపోవడంతో ఎంఎల్సీ హామీ పొందిన వారు ఎదురుచూపులు చూస్తున్నారు. అలాగే… మొన్న జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందిన పార్టీ కీలక నాయకులు తమకు ఎమ్మెల్సీ సీటు దక్కుతుందని ఆశపడుతున్నారు. మరికొందరు ఏదో ఓ రకంగా ఎమ్మెల్సీ అయిపోతే… ఆ తర్వాత మంత్రి పదవి దక్కుతుందని ఆశపడుతున్నారు. టిఆర్ఎస్ లో ప్రస్తుత ఆశావహులు పేర్లను ఒకసారి పరిశీలిస్తే రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్ ఆలీ మండల్ చైర్మన్ స్వామి గౌడ్ కెసిఆర్ రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్రెడ్డి గుత్తా సుఖేందర్ రెడ్డి బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవి ప్రసాద్ పాతూరి సుధాకర్రెడ్డి అనేకమంది టిక్కెట్ రేసులో ఎమ్మెల్సీ ఇవ్వాలని తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే టీఎస్ పీఆర్టీయూ తరపున మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్‌ అభ్యర్థిగా కూర రఘోత్తమ్ రెడ్డి పేరును ఖరారు చేశారు. వీరిలో టీఆర్ ఎస్ మద్దతు ఎనరికి ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. పూల రవీందర్ టీఆర్ ఎస్ లో చేరిన దృష్ట్యా ఆయనకే పార్టీ మద్దతు లభించనుంది. మరోపక్క తక్కెళ్లపల్లి రవీందర్ రావు, సుధీర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తేరా చిన్నప రెడ్డి, వేనేపల్లి చందర్ రావు, కరీంనగర్‌ మేయర్ రవీందర్ సింగ్, చంద్రశేఖర్ గౌడ్, మల్లేశ్, చంద్రశేఖర్ రెడ్డి తో పాటు ఉమ్మడి జిల్లాల టీఆర్ ఎస్ అధ్యక్షులు టిక్కెట్ ఆశిస్తున్నారు. వీరందరిలో టికెట్లు దక్కించుకునే అదృష్టవంతులు ఎంతమంది ఉన్నారో చూడాలి.