తెలంగాణ అధికార టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కలహాలు భగ్గుమంటున్నాయా ? పార్టీలో సీఎం కేసీఆర్ తర్వాత నెంబర్ 2 పొజిషన్ కోసం జరుగుతోన్న ఆధిపత్యం పోరాటంలో ఓ నాయకుడు, మంత్రి వెనకపడిపోయాడా? కేసీఆర్ సైతం తనకు ప్రయారిటీ రోజు రోజుకు తగ్గించేయడంతో పాటు తన వర్గాన్ని అణిచి వేస్తుండడం ఆ మంత్రికి నచ్చడం లేదా ? ఈ క్రమంలోనే ఆ మంత్రి టీఆర్ఎస్కు దూరం కానున్నారా ? అంటే టీఆర్ఎస్ వర్గాల్లోనే ఈ ప్రశ్నకు భిన్నమైన ఆన్సర్లు వస్తున్నాయి.
గత ఎన్నికలకు ముందు వరకు కేసీఆర్ తర్వాత టీఆర్ఎస్లో అంతా తానైన నాయకుడు ఇప్పుడు తాను ఎమ్మెల్యేగా ఉన్న జిల్లాకే పరిమితమయ్యారన్న భావన తెలంగాణలో బలంగా వినిపిస్తోంది.
ఈ క్రమంలోనే సదరు మంత్రి టీడీపీ శాసనసభాపక్ష నాయకుడు అయిన రేవంత్ రెడ్డితో కలిసి బీజేపీలో చేరడం దాదాపు ఖాయమన్న టాక్ టీఆర్ఎస్ వర్గాల్లో ఇంటర్నల్‌గానే వినిపిస్తోంది.
టీఆర్ఎస్ పగ్గాలు కేసీఆర్ నుంచి మరో వ్యక్తికి వెళ్లిన మరుక్షణమే సదరు నాయకుడు బీజేపీలో జంప్ చేసేస్తారన్న చర్చలు వినవస్తున్నాయి.
ఇందుకు సంబంధించి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా జరిగినట్టు సమాచారం.మరో ట్విస్ట్ ఏంటంటే సదరు వ్యక్తికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఏకంగా ముఖ్యమంత్రి పదవి కూడా ఆఫర్ చేశారట.
అమిత్ షా త్వరలోనే హైదరాబాద్‌కు రానున్నాడు.ఈ క్రమంలోనే ఈ మ్యాటర్‌పై మరింత క్లారిటీ వస్తుందని తెలుస్తోంది.సదరు టీఆర్ఎస్ మంత్రికి తెలంగాణ అంతటా మంచి ఫాలోయింగ్ ఉంది.ఈ క్రమంలోనే ఆయన్ను బీజేపీలోకి లాక్కుంటే తిరుగు ఉండదని ఆ పార్టీ ప్లాన్‌గా తెలుస్తోంది.
ఇంతకు టీఆర్ఎస్లో సదరు మంత్రి ఎవరో ఈ పాటికే మీకు అర్థమై ఉంటుందనుకుంట.?
.