టీఆర్‌ఎస్‌ మంత్రులకు చావో రేవో  

Trs Ministers Afraid Of Muncipal Elections Results-telangana Muncipal Elections,trs And Congress And Bjp,trs Ministers

తెలంగాణలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికలు టీఆర్‌ఎస్‌ మంత్రులకు చావో రేవో అన్నట్లుగా మారింది.మంత్రులకు మరియు ఎమ్మెల్యేలకు మున్సిపాలిటీలను అప్పగించి వాటి విజయం బాధ్యతలను సీఎం కేసీఆర్‌ అప్పగించారు.

TRS Ministers Afraid Of Muncipal Elections Results-Telangana Trs And Congress Bjp Trs

ఫలితాల్లో తేడా వస్తే మంత్రులకు షాక్‌ తప్పదంటూ ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.పలువురు మంత్రులు ఈ విషయమై చాలా ఆందళనగా ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ముగ్గురు నలుగురు మంత్రులు తమకు అప్పగించిన మున్సిపాలిటీల్లో మంచి ఫలితాలు రావని, దాంతో తమ పదవులు పోతాయేమో అనే భయంతో ఉన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

కేసీఆర్‌ ఇప్పటికే మంత్రులు మరియు ఎమ్మెల్యేలకు పలు దఫాలుగా మీటింగ్‌ పెట్టి మరీ వార్నింగ్స్‌ ఇచ్చాడు.

అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసి మరీ అన్ని మున్సిపాలిటీలను దక్కించుకోవాల్సిందిగా కేసీఆర్‌ ఆదేశాలు ఇచ్చాడు.అయినా కూడా కొన్ని మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌కు ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

దాంతో ఆ మున్సిపాలిటీల బాధ్యులుగా ఉన్న ఎమ్మెల్యేలు మరియు మంత్రులు టెన్షన్‌ పడుతున్నారు.రేపటి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలంటే మరికొద్ది సమయం వేచి చూడాల్సిందే.

తాజా వార్తలు

Trs Ministers Afraid Of Muncipal Elections Results-telangana Muncipal Elections,trs And Congress And Bjp,trs Ministers Related....