తప్పు జరిగింది నిజమేనా ? టీఆర్ఎస్ మంత్రి పై అనర్హత వేటు ?

తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ కు పెద్ద షాకే తగిలే విధంగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.ముఖ్యంగా టిఆర్ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చుట్టూ వివాదం అలుముకుంది.2018 ముందస్తు ఎన్నికల సమయంలో మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసిన శ్రీనివాస్ గౌడ్ ఆ సమయంలో నామినేషన్ తో పాటు, అఫిడవిట్ దాఖలు చేశారు.దానిని ఎన్నికల సంఘం వెబ్ సైట్ లోనూ పొందుపరిచారు.

 Trs-minister Srinivas Gowda Is Likely To Be Disqualified Trs Minister, Srinivas-TeluguStop.com

తొలి దశలో జరిగిన ఎన్నికలు కావడంతో దాదాపు రెండు నెలల తర్వాత కౌంటింగ్ నిర్వహించారు.కాకపోతే కౌంటింగ్ కు రెండు రోజులు ముందు వెబ్ సైట్ లో శ్రీనివాస్ గౌడ్ కు చెందిన కొత్త ఆఫిడవిట్ కనిపించింది.

పాత అఫిడవిట్ ను తొలగించి, కొత్తది వెబ్ సైట్ లో పొందుపరచడం తో వివాదం మొదలైంది.

ఒకసారి నామినేషన్ ఆమోదం పొందిన తర్వాత అఫిడవిట్ ను తొలగించడం సాధ్యం అయ్యేపని కాదు.

దీనికి ఎన్నికల సంఘం అధికారులు తగిన విధంగా సహకరిస్తే తప్ప ఈ వ్యవహారంపై కొంతమంది కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.దీంతో రంగంలోకి దిగిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ వ్యవహారాన్ని నిగ్గు తేల్చాలని మొన్నటి వరకు తెలంగాణ ఎన్నికల సంఘం అధికారి గా ఉన్న శశాంక్ గోయల్ కు అప్పగించింది.

  విచారణ జరిపిన గోయల్ ఈ వ్యవహారం నిజమేనని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చినట్టు సమాచారం.

2018 ఎన్నికల సమయంలో ఎన్నికల అధికారిగా పనిచేసిన రజత్ కుమార్ కు ఈ వ్యవహారంలో సంబంధం ఉందని ఆధారాలు లభించడంతో , ఇప్పుడు ఆయన పైన కేసు నమోదు అయ్యే అవకాశం కనిపిస్తోంది.ప్రస్తుత టిఆర్ఎస్ మంత్రిగా ఉన్న శ్రీనివాస్ గౌడ్ పై కేంద్ర ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసే అవకాశం కనిపిస్తోంది.అదే కనుక జరిగితే టిఆర్ఎస్ మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Trs-minister Srinivas Gowda Is Likely To Be Disqualified TRS Minister, Srinivas Goud, Telangana, Telangana Government, Sashank Goyal, Telangana Election Commission, - Telugu Sashank Goyal, Srinivas Goud, Telangana, Trs

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube