ఈటెల రాజేందర్ పై సీరియస్ కామెంట్స్ చేసిన టిఆర్ఎస్ మంత్రి..!!

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఐడి వల్ల భూకబ్జా ఆరోపణలు రావటంతో.ఆయనని అని మంత్రి పదవి నుండి టిఆర్ఎస్ ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే.

 Trs Minister Made Serious Comments On Eetela Rajender-TeluguStop.com

ఇలా ఉంటే తనను టార్గెట్ చేసుకుని కావాలని ఒక పక్క ప్లానింగ్ తో.లేనిపోని అభాండాలు వేస్తున్నారని ఈటల రాజేందర్ తనపై వస్తున్న ఆరోపణల విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అదే విధంగా కెసిఆర్ నాయకత్వాన్ని తప్పుపట్టారు.ఈ పరిణామంతో తాజాగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలు ఈటెల రాజేందర్ వ్యవహారశైలిపై మండిపడుతున్నారు.ఈ నేపథ్యంలో మంత్రి గంగుల కమలాకర్తీవ్రస్థాయిలో ఈటెల పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసైన్డ్ భూములను కొనకూడదు అని తన వ్యాపార అభివృద్ధి కోసం బాధ్యతగల పదవిలో ఉండి  ఈటెల దళితుల  భూములను కొనటం దారుణమని అన్నారు.పార్టీని ఇబ్బంది పెట్టడమే ఈటెల రాజేందర్ యొక్క లక్ష్యమని ఆరోపించారు.

 Trs Minister Made Serious Comments On Eetela Rajender-ఈటెల రాజేందర్ పై సీరియస్ కామెంట్స్ చేసిన టిఆర్ఎస్ మంత్రి..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆయనకు ప్రతిపక్ష పార్టీ నాయకులతో చీకటి ఒప్పందాలు కూడా ఉన్నాయని మంత్రి గంగుల అనుమానం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని దొరా అంటూ ఆయన విమర్శించటం దారుణమని బిసీ ముసుగులో ఈటెల రాజేందర్ పార్టీని ఇబ్బంది పెట్టే రీతిలో వ్యవహరించారని అన్నారు.

Telugu Eetela Rajender, Kcr, Trs-Telugu Political News

అసలు టిఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు ఆయన లేరని గంగుల స్పష్టం చేశారు.సొంత పార్టీ నేతలని ఈటెల అనేక రీతులుగా ఇబ్బందులపాలు చేశారని అసలు రాజకీయంగా ఈటెల రాజేందర్ కి ఈ స్థాయి రావడానికి గల కారణం కేసీఆర్ అని స్పష్టం చేశారు.వ్యక్తులు వస్తారు పోతారు పార్టీ శాశ్వతం అంటూ తాజా పరిస్థితులపై గంగుల తనదైన శైలిలో కామెంట్లు చేశారు.ఈటెల రాజేందర్ స్వలాభం కోసం ఎంతటి దారుణానికి అయినా వెనుకాడరు అంటూ మంత్రి గంగుల షాకింగ్ కామెంట్లు చేశారు.

#Eetela Rajender

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు