'సైరా'కు ఓకే చెప్పినట్లే చెప్పి హ్యాండ్‌ ఇచ్చిన కేటీఆర్‌  

Trs Minister Ktr Not Attend The Saira Narasimha Reddy Pree Release Event-pawan Kalyan,rajamouli,ram Charan,trs Minister Ktr

‘సైరా’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది.అక్టోబర్‌ 2న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయినట్లుగా సమాచారం అందుతోంది.ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇప్పటికే ఎల్బీనగర్‌లో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు షురూ అయ్యాయి.18వ తారీకున జరుపతలపెట్టిన ఈ కార్యక్రమంలో కేటీఆర్‌, పవన్‌ కళ్యాణ్‌, రాజమౌళి, కొరటాల శివలు పాల్గొనబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

Trs Minister Ktr Not Attend The Saira Narasimha Reddy Pree Release Event-pawan Kalyan,rajamouli,ram Charan,trs Minister Ktr-TRS Minister KTR Not Attend The Saira Narasimha Reddy Pree Release Event-Pawan Kalyan Rajamouli Ram Charan Trs Ktr

Trs Minister Ktr Not Attend The Saira Narasimha Reddy Pree Release Event-pawan Kalyan,rajamouli,ram Charan,trs Minister Ktr-TRS Minister KTR Not Attend The Saira Narasimha Reddy Pree Release Event-Pawan Kalyan Rajamouli Ram Charan Trs Ktr

ట్విట్టర్‌లో ఈ ప్రకటన చేసిన కొన్ని నిమిషాలకే మరో ప్రకటన వచ్చింది.కేటీఆర్‌ గారు వస్తారని భావించాం.కాని ఆయన బిజీ షెడ్యూల్‌ కారణంగా రాలేక పోతున్నారు అంటూ ట్విట్టర్‌లో పేర్కొనడం జరిగింది.

కేటీఆర్‌ గతంలో మెగా మూవీస్‌ ఫంక్షన్స్‌కు వచ్చారు.కాని ఈసారి మాత్రం ఆయన రాజకీయ కారణాల వల్ల రాలేక పోతున్నట్లుగా తెలుస్తోంది.హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరుగబోతున్న ఈ వేడుకలో పవన్‌, జక్కన్న, కొరటాలు మాత్రం కన్ఫర్‌గా రాబోతున్నారు.

ఇప్పటికే ఆ విషయంపై క్లారిటీ ఉంది.

రామ్‌ చరణ్‌ నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.150 కోట్లకు పైగా బడ్జెట్‌ను ఈ చిత్రం కోసం ఖర్చు చేశారు.తెలుగు నుండి ఇటీవలే వచ్చిన భారీ చిత్రం సాహో బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడింది.మరి ఈ చిత్రం పరిస్థితి ఏంటా అనేది ప్రస్తుతం అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సైరా చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, అమితాబచ్చన్‌, కిచ్చ సుదీప్‌, విజయ్‌ సేతుపతి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.తమన్నా మరియు నిహారికలు ముఖ్య పాత్రల్లో నటించారు.