గ్రేటర్ లో కీలక పరిణామాలు ? రంగంలోకి ట్రబుల్ షూటర్ ?  

TRS minister hareesh rao key roll on GHMC elections, bjp, elections, ghmc, hareesh rao, kcr, ktr, party joinings, trs, trs party - Telugu Bjp, Elections, Ghmc, Hareesh Rao, Kcr, Ktr, Party Joinings, Trs, Trs Party

గ్రేటర్ సమరం మొదలైపోవడంతో , అన్ని రాజకీయ పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ, గ్రేటర్ లో తమ పార్టీకి తిరుగులేని విజయం ఏ విధంగా సాధించాలో చూస్తున్నాయి .మెజారిటీ డివిజన్లను ఏ విధంగా సొంతం చేసుకోవాలి అనే ప్లాన్లు వేస్తున్నాయి.

TeluguStop.com - Trs Minister Hareesh Rao Key Roll On Ghmc Elections

ఈ క్రమంలోనే ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి వలసలు జోరు అందుకున్నాయి.ముఖ్యంగా టీఆర్ఎస్ బీజేపీ లలో వలసల సందడి ఎక్కువగా కనిపిస్తోంది.

దీనికి తోడు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు, గ్రేటర్ లో పోటీకి దిగడంతో పోటీ రసవత్తరంగా ఉంది.తమ అభ్యర్థుల జాబితాను ఇప్పటికే దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు ప్రకటించడంతో, ఆ పార్టీలో టిక్కెట్లు దక్కని వారంతా ప్రత్యామ్నాయ మార్గంగా, తీవ్ర అసంతృప్తితో ఇతర పార్టీలోకి చేరిపోతున్నారు.

TeluguStop.com - గ్రేటర్ లో కీలక పరిణామాలు రంగంలోకి ట్రబుల్ షూటర్ -General-Telugu-Telugu Tollywood Photo Image
Telugu Bjp, Elections, Ghmc, Hareesh Rao, Kcr, Ktr, Party Joinings, Trs, Trs Party-Political

ముఖ్యంగా బిజెపి లో టికెట్ల పై ఆశలు పెట్టుకున్న వారికి టికెట్లు దొరకకపోవడంతో,  టీఆర్ఎస్ వైపు వెళ్ళిపోతుండగా, టిఆర్ఎస్ లోని అసంతృప్తులు బిజెపి బాట పడుతున్నారు.ఈ విధంగా ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వలసలు జోరందుకున్నాయి.తాజాగా టిఆర్ఎస్ గ్రేటర్ కార్పొరేట్ టికెట్ దక్కని ఒక నాయకుడు, బిజెపిలో చేరి పోగా , రాత్రికి రాత్రి రంగంలోకి దిగిన ట్రబుల్ షూటర్ హరీష్ రావు  సదరు నాయకుడిని వెనక్కి పిలిపించి టిఆర్ఎస్ కు జై కొట్టిచ్చినట్లు తెలుస్తోంది.వెంగాల్ రావు నగర్ టిఆర్ఎస్ కార్పొరేటర్ కిలారి మనోహర్, రామచంద్రపురం కార్పొరేటర్ అంజయ్య, టిఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిపోయారు.

 టికెట్లు దక్కలేదన్న కోపంతో వీరు ఆ పార్టీలో చేరగా, హరీష్ చక్రం తిప్పి తిరిగి సొంతగూటికి చేర్చారు.ప్రస్తుతం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గెలుపు పై ఆశలు పెట్టుకున్నారు.

మళ్లీ గ్రేటర్ పీఠం టీఆర్ఎస్ ఖాతాలో పడే విధంగా ఆయన చక్రం తిప్పుతున్నారు.ఈ నేపథ్యంలో తమ కుమారుడు కేటీఆర్ తో పాటు ట్రబుల్ షూటర్ హరీష్ ను రంగంలోకి దించి, ఎక్కడికక్కడ అసంతృప్తులను గుర్తించి వారిని బుజ్జగించే బాధ్యతలను హరీష్ కు అప్పగించినట్లు తెలుస్తోంది.

ఇక మొన్నటి దుబ్బాక ఉప ఎన్నికలలో పూర్తి బాధ్యతను తాను తీసుకుని పనిచేసినా, ఫలితం కనిపించకపోవడంతో, గ్రేటర్ లో విజయం కోసం హరీష్ గట్టిగానే శ్రమ పడుతున్నట్టుగా కనిపిస్తున్నారు.

#Trs Party #Party Joinings #Elections #Hareesh Rao #GHMC

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Trs Minister Hareesh Rao Key Roll On Ghmc Elections Related Telugu News,Photos/Pics,Images..