టీఆర్ఎస్ మంత్రికి షాక్‌... బీజేపీలోకి సోద‌రుడు...!

తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ వ‌రుస షాకులు ఇస్తోంది.ఇప్ప‌టికే దుబ్బాక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ సంచ‌ల‌న విజ‌యం సాధించింది.

 Trs Minister Got Shock.. Brother Joined In Bjp,eraballi Dayakar Rao,trs,telangan-TeluguStop.com

అలాగే గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌కు బీజేపీ విజ‌యాన్ని దూరం చేసింది.ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల్లో టీఆర్ఎస్ ఒంట‌రిగా మేయ‌ర్ పీఠం అధిరోహించ‌లేని ప‌రిస్థితి.

మ‌జ్లిస్ పార్టీతో జ‌ట్టుక‌ట్టి టీఆర్ఎస్ మేయ‌ర్ పీఠం సొంతం చేసుకున్నా అనేక విమ‌ర్శ‌లు ఎదుర్కోవ‌డంతో పాటు బీజేపీకి మ‌రింత బ‌లం ఇచ్చిన‌ట్ల‌వుతుంది.

ఇక గ్రేట‌ర్ షాక్‌తో కేసీఆర్ ఆఘ‌మేఘాల మీద ఢిల్లీ వెళ్లి క‌మ‌లం పెద్ద‌ల ముందు త‌ల వంచ‌డంతో ఆయ‌న‌లో గుబులు మొద‌లైంద‌న్న చ‌ర్చ‌లు కూడా స్టార్ట్ అయ్యాయి.

ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీని తెలంగాణ‌లో పూర్తిగా నిర్వీర్యం చేసిన బీజేపీ ఇప్పుడు ఏకంగా టీఆర్ఎస్ పార్టీలో కీల‌క నేత‌లు, అసంతృప్త‌, అస‌మ్మ‌తి నేత‌ల‌ను టార్గెట్ చేసింది.తాజాగా టీఆర్ఎస్ కేబినెట్లో మంత్రిగా ఉన్న సీనియ‌ర్ నేత ఎర్ర‌బెల్లి దయాక‌ర్‌రావు సోద‌రుడు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న‌ట్టు తెలుస్తోంది.

గ‌తంలో ఎర్ర‌బెల్లి ప్ర‌దీప్‌రావు ప్ర‌జారాజ్యం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.ఆ త‌ర్వాత కొంత కాలంగా స్త‌బ్దుగా ఉన్న ఆయ‌న ఇప్పుడు త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు నేప‌థ్యంలో బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది.

ఆయ‌న పార్టీ ఎంట్రీపై ఇప్ప‌టికే బీజేపీ నేత‌ల‌తో చ‌ర్చ‌లు కూడా పూర్త‌య్యాయంటున్నారు.ఇక బీజేపీలో చేరే ప్ర‌దీప్‌రావు వ‌చ్చే ఎన్నిక‌ల్లో వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది.

ఇక ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు సోద‌రుడు పార్టీ మార్పు వ్య‌వ‌హారంపై మంత్రి ద‌యాక‌ర్‌రావు ఇప్ప‌టికే పార్టీ నేత‌ల‌తో చ‌ర్చించ‌డంతో పాటు త‌న సోద‌రుడు వెళ్లినంత మాత్రాన పార్టీకి వ‌చ్చిన న‌ష్టం ఏం లేద‌ని చెప్పిన‌ట్టు స‌మాచారం.మ‌రో టీ కేబినెట్లో మంత్రి సోద‌రుడు బీజేపీలోకి వ‌స్తుండ‌డంతో ఆ పార్టీ వ‌ర్గాల్లో ఎక్క‌డా లేని జోష్ నెల‌కొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube