'కారు' పార్టీలో సభ్యత్వాల కిరికిరి ? అడ్డంగా బుక్కైపోతున్నారుగా ?

ఒకవైపు తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ పై జనాల్లో రోజు రోజుకి వ్యతిరేకత పెరిగిపోతూ వస్తోంది.మరో వైపు బలమైన రాజకీయ ప్రత్యర్ధులు టీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుంటూ వ్యవహరిస్తున్న తీరుతో ఎక్కడికక్కడ అధికార పార్టీ నాయకులూ, ఎమ్యెల్యే లు, మంత్రులు, ఎంపీ లు ఇలా అందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.

 Trs Membership Records That Have Become An Embarrassment To Mlas, Kcr, Trs, Ts P-TeluguStop.com

ఎలా అయినా ప్రజల్లో వ్యతిరేకత తగ్గించుకుని, రాజకీయ ప్రత్యర్థులకు చెక్ పెట్టే విధంగా వ్యవహరించేలా టీఆర్ఎస్ అధిష్టానం సరికొత్త రాజకీయ ఎత్తుగడలకు శ్రీకారం చుడుతూ వస్తోంది.దీనిలో భాగంగానే టీఆర్ఎస్ బలం మరింతగా పెరిగేలా, తమకు ఎదురు లేకుండా చేసుకునేందుకు పార్టీ సభ్యత్వ నమోదాలకు శ్రీకారం చుట్టారు.

ప్రతి నియోజకవర్గంలో యాబైవేలకు తక్కువ కాకుండా సభ్యత్వ నమోదాలు చేయించాలనే షరతు విధించడం తో ఇప్పుడు లభో దిభో అనే పరిస్థితి తలెత్తింది.

అసలు గతంలో మాదిరిగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ఉండి ఉంటే టిఆర్ఎస్ నాయకులకు ఎటువంటి ఇబ్బందిిి ఉండేది కాదు.

కానీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు వినూత్నంగా చేపట్టడం, సభ్యులుగాా చేర్చుకునే వారి పూర్తి వివరాలు ఓటర్ ఐడి తో సహా నమోదుు చేయాల్సి రావడం.వాటిని పార్టీ ప్రత్యేక యాప్ లో నమోదు చేయాల్సి రావడం ఇలా ఎన్నో ఇబ్బందులు ఉండడం తో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలంటే తలకు మించిన భారంగా తయారైంది.

ఎమ్మెల్యేలు,నియోజకవర్గ స్థాయి నాయకులు ఇప్పుడు పూర్తిగా ఈ కార్యక్రమంలోనే తలమునకలై ఉన్నారు.పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి సభ్యత్వ నమోదు పూర్తి చేయాలనే షరతు విధించడంతో ఎమ్మెల్యేలు, నాయకులు హైరానా పడుతున్నారు.

దీంతో చేసేది లేక ప్రభుత్వ పథకాలు పొందుతున్న లబ్ధిదారులతో బలవంతంగా సభ్యత్వ నమోదు చేయించడంటీఆర్ఎస్ సభ్యత్వం తీసుకోకపోతే ప్రభుత్వ పథకాలు అందవు అని బెదిరింపులకు దిగడం, అవి కాస్తా రాజకీయ ప్రత్యర్థులు వీడియోలు తీయించి మరి సోషల్ మీడియాలో పోస్ట్ చేయించడం ఎన్నో వ్యవహారాలు ఈ మధ్యకాలంలో చోటు చేసుకోవడంతో, ఈ విధంగా బెదిరింపు వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేలు, మంత్రులు అడ్డంగా బుక్కైపోతున్నారు.దాదాపు 50 లక్షల సభ్యత్వ నమోదు చేయించాలని కెసిఆర్ షరతులు విధించడం తో ఎమ్మెల్యేలు , మంత్రుల్లో టెన్షన్ పెరిగిపోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube