హుజూరాబాద్‌లో అన‌వ‌స‌రంగా ఆ కామెంట్లు చేస్తున్న టీఆర్ ఎస్‌.. బెడిసికొడుతుందా..?

తెలంగాణ రాజ‌కీయాల్లో కొత్త మ‌లుపుకు శ్రీకారం చుడుతోంది హుజూరాబాద్ ఉప ఎన్నిక‌.గ‌త చరిత్ర‌లో ఎన్న‌డూ లేనంత సీరియ‌స్‌గా అన్ని పార్టీలు తీసుకోవ‌డం ఇక్క‌డ గ‌మ‌నార్హం.

 Trs Making Those Comments Unnecessarily In Huzurabad .. Is It Confusing Huzurab-TeluguStop.com

ఈ ఎన్నిక రాబోయే సాధార‌ణ ఎన్నిక‌ల‌ను డిసైడ్ చేస్తుంద‌ని అన్ని పార్టీలు న‌మ్ముతున్నాయి.ఇందుకోసం ఇప్ప‌టి నుంచే రాజ‌కీయంగా ప‌క్కా వ్యూహాల‌తో ముందుకు వెళ్తున్నాయి.

ఏ చిన్న తప్పు జరగినా బెడిసి కొడుతుంద‌నే భ‌యంతో అతి జాగ్ర‌త్త ప‌డుతున్నాయి బీజేపీ, టీఆర్ ఎస్ పార్టీలు.కాంగ్రెస్‌ను ప‌క్క‌న పెట్టేసి ఈ రెండు పార్టీల నేత‌లు ఒక‌రిపై ఒక‌రు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేసుకుంటున్నాయి.

ఈటల రాజేందర్ మీద‌నే ప్ర‌ధానంగా గురి పెడుతూ హ‌రీశ్‌రావు విమ‌ర్శ‌లుచేస్తున్న సంగ‌తి తెలిసిందే.అయితే కేవ‌లం ఈట‌ల‌ను టార్గెట్ చేస్తే కుద‌ర‌ద‌ని అటు నుంచి న‌రుక్కు రావాల‌నే సామెత‌ను దృష్టిలో పెట్టుకుని హ‌రీశ్ రావు బీజేపీ చేస్తున్న వాటిని కూడా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఇందులో ప్ర‌ధానంగా పెట్రోల్‌రేట్ల మీద హ‌రీశ్ రావు కామెంట్లు చేస్తున్నారు.మిగతా టీఆర్ ఎస్ నేతలు కూడా ఇలాంటి కామెంట్లే చేస్తున్నారు.అయితే దీన్ని తిప్పి కొడుతోంది బీజేపీ.అటు యూత్‌లోనూ కొన్ని ప్ర‌శ్న‌లు త‌లెత్తుతుతున్నాయి.

Telugu Bjp, Etala Rajender, Harishrao, Huzurabad, Ts Potics-Telugu Political New

అదేంటంటే పెట్రోల్ రేటులో రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికంగానే ప‌న్నులు విదిస్తోంద‌నే వాద‌న‌నున బీజేపీ తెర‌మీద‌కు తెస్తోంది.ఇప్ప‌టికే రాష్ట్రం ప‌న్ను కింద రూ.40 వ‌ర‌కు వ‌సూలు చేస్తోంద‌నే వాద‌న‌ను బీజేపీ తెర‌మీద‌కు తెచ్చింది.మ‌రి కేంద్రాన్ని ప‌న్నులు త‌గ్గించుకునేందుకు అడిగే ముందు ఇటు తెలంగాణ ప్ర‌భుత్వం ఎందుకు త‌గ్గించ‌బోదంటున్నారు చాలామంది.

తెలంగాణ ప్ర‌జ‌ల గురించి ఆలోచించే ప్ర‌భుత్వం అయితే ప‌న్ను భారం త‌గ్గించొచ్చు గ‌దా అనే ప్ర‌శ్న‌లు బీజేపీ నేత‌లు విసురుతున్నారు.ఇది కాస్తా టీఆర్ ఎస్ కు పెద్ద ఎఫెక్ట్ ప‌డే అవ‌కాశం కూడా ఉంద‌ని చెబుతున్నారు విశ్లేష‌కులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube