బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ నజర్... అందుకే ఇలా చేస్తున్నారా

Trs Look At Bjp Workers Is That Why You Are Doing This

హుజురాబాద్ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో రోజు రోజుకు హీటేక్కిస్తున్న అంశం.అయితే చాలా వరకు ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.

 Trs Look At Bjp Workers Is That Why You Are Doing This-TeluguStop.com

అయితే చాలా వరకు ఈ ఉప ఎన్నికలో ప్రధాన పోటీ బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే జరుగుతున్నట్టు మనకు స్పష్టంగా అర్ధమవుతోంది.ఈటెలకు హుజురాబాద్ లో మంచి పట్టు ఉండటంతో అంతేకాక ఈటెల ఆత్మగౌరవ నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్లడం బీజేపీకి మరింత సానుకూల అంశంగా ఉన్న పరిస్థితి ఉంది.

అయితే ప్రతి ఒక్క పార్టీ తన ప్రత్యర్థి పార్టీని బలహీన పరచడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తారనే విషయం మనకు తెలిసిందే.

 Trs Look At Bjp Workers Is That Why You Are Doing This-బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ నజర్… అందుకే ఇలా చేస్తున్నారా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu @bjp4telangana, Etela Rajender, Huzurabad Bypoll, Trs Party-Political

అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థి బీజేపీ అన్న విషయం తెలిసిందే.అందుకే బీజేపీపై టీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.అయితే స్థానికంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న యువకులు ఎవరైతే బీజేపీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నారో వారిని బీజేపీకి ప్రచారం చేయవద్దని ఒకవేళ ప్రచారం చేస్తే భవిష్యత్తులో ప్రభుత్వ పధకాలు మీకు అందే అవకాశం చాలా తక్కువ అని టీఆర్ఎస్ నేతలు బీజేపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు అక్కడ స్థానిక యువకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది.అందుకే త్వరలో ఈటెలను కలిసి  తమకు ఎదురవుతున్న అనుభవాలను పంచుకొని గెలిచాక తమకు అండగా ఉండాలని కోరనున్నట్లు తెలుస్తోంది.

అయితే టీఆర్ఎస్ ఇటువంటి వ్యూహం ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటని మనం ఒకసారి విశ్లేషించుకుంటే ఎక్కడైనా యువత మద్దతిస్తేనే ఆ సదరు పార్టీకి ఎక్కువగా విజయవకాశాలు ఉండే అవకాశం ఉంటుంది.అయితే సాధ్యమైనంత ఎక్కువ యువత మద్దతు పొందాలనే వ్యూహంతో బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ నజర్ వేసినట్టు తెలుస్తోంది.

#Huzurabad #Trs #Etela Rajender #@BJP4Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube