కేసీఆర్ హరీష్ అంతా వణికిపోతున్నారే ? ఆ ఎన్నికల్లో సీన్ రివర్సేనా ?

తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు ఇద్దరూ పూర్తిగా దుబ్బాక ఉప ఎన్నికలపైనే దృష్టి సారించారు.ఈ ఎన్నికల్లో విజయాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

 Trs Leaders Tention On Dubbaka Elections Dubbaka Elections, Solipeta Ramalingare-TeluguStop.com

టిఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మరణంతో ఇక్కడ ఉప ఎన్నికలు రావడంతో, మళ్ళీ ఇక్కడ టిఆర్ఎస్ జెండా రెపరెపలాడించాలి అని టీఆర్ఎస్ అగ్రనేతలంతా ప్రయత్నిస్తున్నారు.టీఆర్ఎస్ కు గట్టి ఇచ్చేందుకు బీజేపీ శరవేగంగా పావులు కదుపుతోంది.

బిజెపి అభ్యర్థిగా సీనియర్ నాయకులు రఘునందన్ రావు ఉన్నారు.గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఓటమి చెందడంతో, ఆయనపై ప్రజల్లో సానుభూతి ఉంది.

అది కాకుండా నియోజకవర్గ ప్రజా సమస్యలపై ఆయన పోరాడుతూ వస్తున్నారు.

ఇదిలా ఉంటే టిఆర్ఎస్ అభ్యర్థిగా సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత కు టికెట్ ఇచ్చేందుకు టిఆర్ఎస్ దాదాపు సిద్ధం అయ్యింది.

ఇక టీఆర్ఎస్ నుంచి సీనియర్ నాయకుడు చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారు.నియోజక వర్గంలో బలమైన నాయకుడుగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్ అధిష్టానం తనకు టికెట్ ఇస్తుందనే ధీమాతో ఉండడంతో పాటు, నియోజకవర్గం అంతా అప్పుడే ప్రచారం సైతం నిర్వహిస్తున్నారు.

గత ఎన్నికల ప్రచారంలో తన తండ్రికి కీలక పదవిని ఇస్తానని టిఆర్ఎస్ పెద్దలు వాగ్దానం చేశారని, కానీ అది నెరవేర్చలేదని, ఇప్పుడు తనకు తప్పనిసరిగా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సిందేనని ఆయన గట్టి పట్టు పడుతున్నారు.

Telugu Cheruku Muthyam, Dubbaka, Hareeshrao, Raghunandanrao, Srinivasa-Telugu Po

అయితే టిఆర్ఎస్ మాత్రం ఎమ్మెల్సీ ఇచ్చి బుజ్జగించాలి అని చూస్తున్నా, శ్రీనివాస్ రెడ్డి మాత్రం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సిందేనని, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పోటీ చేయాలంటూ టిఆర్ఎస్ పెద్దలను ప్రశ్నిస్తున్నారు.ఒకవేళ టిఆర్ఎస్ అభ్యర్థిత్వం దక్కకపోతే రెబల్ గా పోటీ చేయాలని ముందుగా భావించినా, ఇప్పుడు బీజేపీ నుంచి ఆయనకు ఆఫర్లు వస్తుండటం, ఆయన బిజెపిలో చేరితే దుబ్బాక టిక్కెట్ ఇచ్చేందుకు సిద్ధం అన్నట్టుగా సంకేతాలు పంపించడంతో దుబ్బాక రాజకీయం కీలక మలుపులు తిరుగుతోంది.ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు కు అవసరమైతే మరో కీలక పదవి ఇచ్చి శ్రీనివాస్ రెడ్డిని బిజెపిలో చేర్చుకోవాలని ఆ పార్టీ అగ్ర నేతలు భావిస్తున్నారు.

ఇక్కడ గెలుపు ఓటములను నిర్ణయించేది శ్రీనివాస్ రెడ్డి వర్గం కావడంతో ఆయనను వదులుకోకూడదని బిజెప గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉండడంతో టిఆర్ఎస్ నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి.హరీష్ రావు ఈ నియోజకవర్గంపై పూర్తిగా ఫోకస్ పెట్టి, చిన్నాచితకా నాయకులు అందరికీ ఫోన్లు చేస్తూ టిఆర్ఎస్ గెలుపుకు ఆయన గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube