కాంగ్రెస్ లోకి టీఆర్ఎస్ నేతల క్యూ ! నిజమేనా ..?

ఎన్నికల సమయం లో టాప్ గేర్ వేసి కారు ని రయ్ రయ్ అంటూ దూసుకుపోయేలా చేయాలనుకుంటున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కాంగ్రెస్ పార్టీ ముచ్చెమటలు పట్టిస్తోంది.పార్టీకి చెందిన కీలక నేతలంతా ఒక్కొక్కరుగా ఇలా పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరుతుండడం టీఆర్ఎస్ కు ఆందోళన కలిగిస్తోంది.

 Trs Leaders Queue In To Congress Party-TeluguStop.com

ఈ పరిణామాలతో ఇప్పటికే కంగారుగా ఉన్న కేసీఆర్ కు రెండు కాదు మూడు వికెట్లు అంటూ టీఆర్ఎస్ ను వీడే వారి సంఖ్య చెబుతుండడం … అవి నిజమే అన్నట్టుగా పార్టీని ఒక్కొక్కరూగా వీడడం కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు.

రేవంత్ రెడ్డి మాటలు ఆషామాషీ కాదని.జోరుగా ప్రచారం జరుగుతోంది.కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాహుల్ గాంధీతో సమావేశం అయిన వెంటనే.

తెలంగాణలో ఆ తరువాత పార్టీ వీడే నేత ఎవరంటూ చర్చ ప్రారంభమయింది.కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్న విషయం టీఆర్ఎస్ లో కలకలం రేపింది.

తమ రాజకీయ భవిష్యత్ పై ఆలోచన చేస్తున్న పలువురు ఎంపీలు.దీనిపై లోతుగా పరిశీలిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.

వీరిలో చాలా మంది.కాంగ్రెస్ కు చెందిన ముఖ్య నేతలతో టచ్ లో ఉన్నట్టు కేసీఆర్ కు తెలియడంతో ఎన్నికల ముందు ఈ పరిణామాలు చేటు తెస్తాయేమో అన్న ఆందోళన గులాబీ శిబిరంలో కనిపిస్తోంది.

చేవేళ్లను ఆనుకుని ఉండే.నియోజకవర్గానికి చెందిన.ఓ ఎంపీ చాలా రోజులుగా.టీఆర్ఎస్ కార్యక్రమాల్లో కనిపించడం లేదు.

ఆయన అవడానికి తెలంగాణ వ్యక్తే కానీ.తెలుగు కూడా సరిగ్గా రాదు.

ఆయన గతంలోనే పార్టీ మారుతారని ప్రచారం జరగింది.తర్వాత సైలెంటయిపోయారు.

అలాగే.ఇటీవలే.

కేంద్ర దర్యాప్తు సంస్థ వలలో పడిన.మరో ఎంపీ కూడా.

రెడీ అవుతున్నారని చెబుతున్నారు.అసలు ఆ ఎంపీ.

ఓ మంత్రిపై.అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ చేయడానికి సిద్ధమయ్యారని ప్రచారం జరిగింది.

చివరి క్షణంలో దర్యాప్తు సంస్థ సోదాలతో వెనక్కి తగ్గారు.

ఇక కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని బలం ఉన్న జిల్లాకు చెందిన ఎంపీ కూడా.అదే బాటలో ఉన్నారని.తన పాత పరిచయాలతో.

రంగంలోకి దిగారంటున్నారు.ఆయన జీవితాశయం మంత్రి కావడం.

ఇప్పుడు పోటీ కి చాన్స్ రాకపోవడంతో.తన కలలు కల్లలయినట్లే.

అందుకే.వచ్చిన చోటకే పోదామనుకుంటున్నారట.

ఇప్పటికే సీతారామ్ నాయక్ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది.ఆయనకు బదులుగా లక్ష్మణ్ నాయక్ అనే కేరళ క్యాడర్ ఐపీఎస్‌కు ఎంపీ టిక్కెట్ ఇస్తున్నారని కూడా చెబుతున్నారు.

అయితే ఈ విషయాన్ని సీతారామ్ నాయక్ ఖండిస్తున్నారు.కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఐదారుగురు ఎంపీలు రెడీగా ఉన్నారని.

అందరిని డిసెంబర్ ఏడు లోపుగా కాంగ్రెస్ పార్టీలో చేర్చేస్తామని… ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు చెబుతున్నారు.అయితే.

ఇదంతా కాంగ్రెస్ మైండ్ గేమ్ అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube