తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నేడు జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్నాయి.గత కొద్ది రోజులుగా పలు పార్టీ కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు.
ఎలాగైనా హైదరాబాద్ మేయర్ సీట్ దక్కించుకోవాలని అధికార పార్టీ గట్టిగానే ప్రయత్నిస్తుంది.ఇక్కడ ప్రదాన ప్రతిపక్షం అనుకున్న కాంగ్రెస్ పార్టీ అంతంత మాత్రంగానే ఉన్నది.
తెలంగాణలో ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న బిజేపి ఏమాత్రం అవకాశం దొరికిన అధికార పార్టీ పై మాటల తుటాలు కురిపిస్తుంది.బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్ వాహనాన్ని టిఆర్ఎస్ నేతలు మినర్వా హోటల్ కు సమీపంలో అడ్డుకున్నారు.
ఇరు పార్టీ కార్యకర్తలు ఘర్షణకు దిగడంతో పోలీసులు రంగంలోకి దిగారు.కొంత మంది అల్లరి మూకలను అరెస్ట్ చేసి జైల్ కు పంపారు.బండి సంజయ్ ను అక్కడినుండి పోలీసు వాహనంలో తరలించారు.ఈ ఘటనలో రెండు పార్టీలకు చెందిన వాహనాలు ద్వంసం అయ్యాయి.ఈ ఘటనకు సంబంధించి అనుమానం ఉన్న వారిపై ఎంక్వెరీ చెయ్యగా ఖైరతాబాద్ టిఆర్ఎస్ నేత విజయా రెడ్డి అనుచరులని తెలిసింది.ఈ ఘటనపై బండి సంజయ్ మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ ఎక్కడ తమ నుండి జారిపోతుంది అనే భయం తో టిఆర్ఎస్ నేతలు నాపై దాడికి దిగారు అని అన్నాడు.