ఈటల పై మాటల తూటాలు పేల్చుతున్న గులాభి నేతలు.. ?

తెలంగాణలో మరో కొత్త రాజకీయం తెరపైకి వచ్చింది.దీనికి కారణం ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటల పై భూ ఆక్రమణల ఆరోపణలు రావడంతో ఈ శాఖ నుండి ఆయనను తొలగించడమే అన్న విషయం తెలిసిందే.

 Trs Leaders Are Counter Attacking The Comments Of Etela Rajender , Huzurabad, Ja-TeluguStop.com

ఇక అప్పటి నుండి ఈటల ప్రతిపక్ష నేతగా మారిపోగా గులాభి నేతలకు ఈటలకు నిత్యం మాటల యుద్ధం తీవ్ర స్దాయిలో కొనసాగుతుంది.

ఈ నేపధ్యంలో పలువురు అధికార పార్టీ నేతలు ఈటలను ఊహించని విధంగా విమర్శిస్తున్నారు.

తెరవెనక ఏం జరుగుతుందో తెలియదు గానీ రాజకీయ తెరమీద మాత్రం ఈటల అంటే అస్సలే గిట్టనట్టుగా, తెలంగాణ ప్రతిష్టను ఈటల దెబ్బతీస్తున్నట్టుగా నటిస్తూ విమర్శల జోరు అందుకున్నారట.

ఈ క్రమంలో జమ్మికుంట మున్సిపల్‌ చైర్మన్‌ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు తో పాటుగా, కౌన్సిలర్‌, మాజీ సర్పంచ్‌ పొనగంటి మల్లయ్య, జమ్మికుంట ఎంపీపీ దొడ్డె మమతాప్రసాద్‌ మాట్లాడుతూ, ఈటల తాను కూర్చున్న చెట్టును తానే నరుక్కున్న వ్యక్తిగా అభివర్ణించారు.

వీరే కాకుండా కరీంనగర్, హుజురాబాద్ నియోజక వర్గానికి చెందిన పలువురు నేతలు కూడా టాప్ గేర్‌లో ఉన్న కారు స్పీడ్‌లా, గులాభినేత మెప్పు పొందాలనే ఆరాటంతో ఎంతలా రెచ్చిపోయి విమర్శించాలో అంతలా ఈటల పై మాటల తూటాలు వదులుతున్నారు.మరి చూడాలి ఈ సంఘటన తెలంగాణ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతాయో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube