సంజయ్ దమ్ముంటే ...? టీఆర్ఎస్ సవాల్ 

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అనేక అంశాలపై టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూనే ఉన్నారు.ప్రస్తుతం ఆయన తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తుండడంతో స్థానిక సమస్యలతోపాటు టిఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాలను హైలెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు.

 Trs Leader Jeevan Reddy Sensational Comments On Bandi Sanjay-TeluguStop.com

తాను బిజెపి అధ్యక్షుడిగా ఉండడంతో పూర్తిగా తను మార్క్ తెలంగాణ లో కనిపించే విధంగా బిజెపి రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే విధంగా ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు.ఈ క్రమంలోనే తీవ్రస్థాయిలో టిఆర్ఎస్ నాయకుల పై ఆయన విమర్శలు చేస్తున్న క్రమంలో టీఆర్ఎస్ కూడా ఆయన పై ఎదురు దాడికి దిగింది.

  తాజాగా టీఆర్ఎస్ కీలక నేత పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి బండి సంజయ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన జీవన్ రెడ్డి ఈ సందర్భంగా అనేక అంశాలపై బండి సంజయ్ ను ప్రశ్నించారు.
  తమపై సంజయ్ అనవసరంగా విమర్శలు చేస్తున్నారని, యాసంగి లో 65 వేల కోట్లు ఖర్చు చేసి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశామని చెప్పుకొచ్చారు.ఈ వాన కాలంలో కేంద్రం నుంచి 20 వేల కోట్లు తీసుకువచ్చి తెలంగాణలోని ధాన్యం కొనుగోలు చేసేలా బీజేపీ నేతలు ప్రయత్నించాలని చురకలంటించారు.

 Trs Leader Jeevan Reddy Sensational Comments On Bandi Sanjay-సంజయ్ దమ్ముంటే … టీఆర్ఎస్ సవాల్ -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బండి సంజయ్, కిషన్ రెడ్డి, రఘునందన్ రావు, అరవింద్ వంటి నాయకులకు రాజకీయ భవిష్యత్తును కల్పించింది.తెలంగాణ ప్రజలని, వారి సంక్షేమానికి వీరంతా కృషి చేయాల్సిన బాధ్యత ఉంది అంటూ సూచించారు.

అనవసర యాత్రలు మాని రైతు సంక్షేమం కోసం సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.

Telugu Bandi Sanjay, Bjp, Congress, Farmers, Hujurabad, Narendra Modi, Pcc Chief Revanth Reddy, Raghunandan Rao, Telangana, Trs Leader Jeevan Reddy, Trs Vs Bjp, Ts Politics, Yasangi-Telugu Political News

తమ పార్టీ నేతలు 14 అంశాలపై ఢిల్లీలో పది రోజులు మకాం వేసి మరి కేంద్ర మంత్రులను కలిసి వినతులు ఇచ్చామని చెప్పుకొచ్చారు.తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, రఘునందన్, కిషన్ రెడ్డి వంటివారు ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లు పట్టుకుని తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని సవాల్ చేశారు.
 

Telugu Bandi Sanjay, Bjp, Congress, Farmers, Hujurabad, Narendra Modi, Pcc Chief Revanth Reddy, Raghunandan Rao, Telangana, Trs Leader Jeevan Reddy, Trs Vs Bjp, Ts Politics, Yasangi-Telugu Political News

ఎన్నికల సమయంలో రైతు సమస్యలపై మాట్లాడడం కాదని, కాంగ్రెస్, బీజేపీలు కలిసి ఢిల్లీకి వెళ్లి రైతు సమస్యలపై పోరాటం చేయాలని సూచించారు.అసలు తెలంగాణలో యాత్ర చేపట్టడం కాదని, ఢిల్లీలో ఈ యాత్రలు చేయాలంటూ సూచించారు.ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పైన జీవన్ రెడ్డి విమర్శలు చేశారు.

రేవంత్ హోల్ సేల్ బ్లాక్ మెయిలింగ్ కు బ్రాండ్ అంబాసిడర్ అంటూ మండిపడ్డారు.బండి సంజయ్ పాదయాత్ర ఫెయిల్ అయిందని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

#Hujurabad #Yasangi #Bandi Sanjay #Narendra Modi #Congress

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు