జోరు మీద ఉన్న కారు: ఫలితాలతో కొత్త ఉత్సాహం  

The Car On The Swing: New Excitement With Results-ghmc,ghmc Results,hyderabad,kcr,ktr,results,trs,జోరు మీద ఉన్న కారు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ పార్టీలో ఎక్కడలేని ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి.ఈ ఫలితాలు ముందే ఊహించినా ఈ స్థాయిలో ఫలితాలు వస్తాయని మాత్రం టీఆర్ఎస్ ఊహించలేకపోయింది.

The Car On Swing: New Excitement With Results-Ghmc Ghmc Results Hyderabad Kcr Ktr Results Trs జోరు మీద ఉన్న కారు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా సాగుతోంది.120 మున్సిపాలిటీల్లో 80 స్థానాల్లో టీఆర్ఎస్ ఇప్పటికే తన హావా చూపించింది.ఇక 9 కార్పొరేషన్లలో 4 చోట్ల ఆధిక్యంలో ఉంది.ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ భవన్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు ,ఎంపీలు టిఆర్ఎస్ శ్రేణులు కార్యకర్తలు పెద్ద ఎత్తున విజయాన్ని ఆస్వాదిస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.

ఇప్పటికే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ మంత్రి, తెలంగాణ భవన్ కు చేరుకొని ఎన్నికల ఫలితాలను పర్యవేక్షిస్తున్నారు.

ఇప్పటికే నిజామాబాద్ లోని భీంగల్ మున్సిపాలిటీని టిఆర్ఎస్ గెలుచుకుంది.ధర్మపురి మున్సిపాలిటీ కూడా టిఆర్ఎస్ పార్టీ దక్కించుకుంది.

తెలంగాణ వ్యాప్తంగా బలపడి మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో తమ బలం నిరూపించుకోవాలని చుసిన కాంగ్రెస్ నాయకులు ఈ ఫలితాలతో ఢీలా పడ్డారు.ఎక్కడికక్కడ కాంగ్రెస్ కంచుకోటాలకు కూడా బీటలు వారడంతో పూర్తిగా కాంగ్రెస్ నాయకులు నిస్తేజంలో పడిపోయారు.

ముఖ్యంగా కాంగ్రెస్ కంచుకోట ఖమ్మం జిల్లాలో కారు జోరు కొనసాగుతోంది.తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర లోనూ కాంగ్రెస్ డీలా పడింది.

మధిర మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించగా ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం 8 వార్డుల్లో 5 చోట్ల టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారు.కాంగ్రెస్‌, టీడీపీ సీపీఐ ఒక్కో స్థానంలో గెలిచారు.మెజార్టీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ ముందంజంలో ఉంది.దీంతో మధిర మున్సిపాలిటీపై తొలిసారి టీఆర్ఎస్ జెండా రెపరెపలాడింది.

ప్రతి చోటా ఇదే విధమైన ఫలితాలు వస్తుండడంతో టీఆర్ఎస్ లో ఎక్కడలేని ఉత్సాహం కనిపిస్తోంది.

.

తాజా వార్తలు