కేసీఆర్‌ అతి నమ్మకం కొంప ముంచిందా?  

Trs Kcr Over Confidence కేసీఆర్‌-cm Kcr,congress,elections 2019,telugu Desam Party,trs Kcr,ys Jagan,ఉత్తమ్ కుమార్ రెడ్డి,కే‌సి‌ఆర్,తెలంగాణ వార్తలు,మోడి

ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణ ప్రజలు గట్టి షాక్‌ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టి అద్బుతమైన విజయాన్ని కేసీఆర్‌కు బహుమానంగా ఇచ్చారు. పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలనే ఉద్దేశ్యంతో ఆరు నెలలు ముందుగానే ముందస్తు ఎన్నికలకు కేసీఆర్‌ వెళ్లిన విషయం తెల్సిందే..

కేసీఆర్‌ అతి నమ్మకం కొంప ముంచిందా?-Trs Kcr Over Confidence కేసీఆర్‌

తెలంగాణలోని మొత్తం 17 స్థానాల్లో ఒకటి ఎంఐఎంకు వదిలేసి మిగిలిన 16 స్థానాలను కేసీఆర్‌ గెలవాలని భావించాడు. అందుకోసం ముందు నుండే ప్రయత్నాలు చేశాడు.

ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సునాయాసంగా టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు కొట్టుకు వస్తారని కేసీఆర్‌ భావించాడు. కాని అనూహ్యంగా తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌కు షాక్‌ ఇచ్చారు.

ఈసారి కాంగ్రెస్‌కు అండగా తెలంగాణ ప్రజలు నిలవడం ఆశ్చర్యకర విషయం. నల్లగొండ జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాలను కూడా టీఆర్‌ఎస్‌ చేజార్చుకుంది.

మొత్తం స్థానాల్లో ఇప్పుడు టీఆర్‌ఎస్‌ 10 స్థానాలు కూడా గెలుపొందే అవకాశం కనిపించడం లేదు. కడపటి వార్తలు అందే సమయానికి టీఆర్‌ఎస్‌ పార్టీ 5 గెలువగా, కాంగ్రెస్‌ పార్టీ 4, బీజేపీ 1, ఎంఐఎం 1 స్థానాల్లో గెలుపొందడం జరిగింది. ఈ ఫలితం ప్రస్తుతం కేసీఆర్‌ కు మింగుడు పడటం లేదు.

కేసీఆర్‌ చాలా నమ్మకంగా చెప్పుకొచ్చిన స్థానాల్లో టీఆర్‌ఎస్‌ ఓడిపోవడం చర్చనీయాంశం అవుతోంది.

కేసీఆర్‌ అతి నమ్మకం కారణంగానే ఈ ఫలితం అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎక్కువ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు చాలా లైట్‌గా ఉండి ప్రచారం చేయలేదనే టాక్‌ వస్తుంది.

కేసీఆర్‌ కూడా ఈజీగా గెలిచేస్తాం, మీరు ఏమైన మెజార్టీని చూసుకోండి అంటూ గొప్పలు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు పరిస్థితి మొత్తం తారు మారు అయ్యింది.