ఆ పదవులకు టిఆర్ఎస్ తీవ్ర పోటీ ! కేసీఆర్ ఏం చేస్తారో ?

ఒకవైపు హుజురాబాద్ ఎన్నికల నడుస్తుండటంతో అధికార పార్టీ టిఆర్ఎస్ ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని రకాల ఎత్తుగడలు వేస్తోంది.ఫలితం తమకు అనుకూలంగా లేకపోతే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తీవ్రంగా దెబ్బతినాల్సి వస్తుందని, ఆ పార్టీ టెన్షన్ లో ఉండగా, ఇప్పుడు మరో టెన్షన్ వచ్చి పడింది.

 Trs, Kcr, Ktr, Hujurabad, Elections, Mlc Posts, Tg Politics-TeluguStop.com

ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి.దీంతో ఆ పదవులపై టిఆర్ఎస్ సీనియర్ నాయకులు చాలామంది ఆశలు పెట్టుకున్నారు.

దాదాపు 60 మందికి పైగా నేతలు ఎమ్మెల్సీ స్థానాలకు కోసం పోటీపడుతుండగా, వారిలో ఎవరిని ఎంపిక చేయాలి అనేది అతి పెద్ద టెన్షన్ గా మారింది.

 మరో రెండు మూడు రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రాబోతోంది అనే సంకేతాలతో ఎవరికివారు కెసిఆర్ పై ఒత్తిడి పెంచుతున్నారు.

ఇప్పటికే అనేక మందికి ఎమ్మెల్సీ పదవులపై హామీలు లభించడంతో, వారు తమకు అవకాశం దక్కుతుందా లేదా అనే టెన్షన్ లో ఉన్నారు.సామాజిక వర్గాల లెక్కలు చూపిస్తూ తమకే ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కట్టబెట్టాలని అధినేతపై ఒత్తిడి పెంచుతున్నారు.

గతంలోనే గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి స్థానంలో కౌశిక్ రెడ్డి ని కేసీఆర్ ఎంపిక చేశారు.దీనికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.అయితే ఇంకా ఆది పెండింగ్ లోనే ఉంది .దీంతోపాటు గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, ఫరీదుద్దీన్, ఆకుల లలిత, బొడ కుంటి వెంకటేశ్వర్లు, నేతి విద్యాసాగర్ వంటి వారి పదవీ కాలం పూర్తి కావడంతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి.

Telugu Guttasukendar, Hujurabad, Mlc, Trs-Telugu Political News

 దీంతో మళ్లీ తమకు రెన్యువల్ చేయాలని కడియం శ్రీహరి , గుత్తా సుఖేందర్ రెడ్డి వంటివారు కేసీఆర్ పై ఒత్తిడి పెంచుతున్నారు.వీ ఎమ్మెల్సి పదవుల ద్వారా మంత్రిమండలిలో స్థానం సంపాదించాలని చూస్తున్నారు.అలాగే దేశపతి శ్రీనివాస్ రావు, శ్రవణ్ కుమార్ రెడ్డి, ఎల్ పి ఇంచార్జ్ రమేష్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ వంటివారు ఎమ్మెల్సీ పదవి పై ఆశలు పెట్టుకున్నారు .ఇక వరంగల్ నుంచి మాజీ స్పీకర్ మధుసూదనాచారి ,తక్కెళ్లపల్లి రవీందర్ రావు, రాజయ్య యాదవ్, నల్గొండ నుంచి కోటిరెడ్డి, ఖమ్మం జిల్లా నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తాత మధు వంటి వారు ఎమ్మెల్సీ పదవులను ఆశిస్తున్నారు.ఇక ఆదిలాబాద్ జిల్లా నుంచి నిర్మల్ ఇన్చార్జి శ్రీహరి, పాలమూరు జిల్లా నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇలా ఎవరికి వారే పదవులు పై ఆశలు పెట్టుకుని అధినేత కేసీఆర్ పై అనేక మార్గాల్లో ఒత్తిడి పెంచుతూ ఉండడం , మరోవైపు హుజురాబాద్ ఎన్నికల టెన్షన్ ఇవన్నీ కేసీఆర్ కు తలనొప్పిగా మారాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube