క్యాంపు రాజ‌కీయాల‌కు టీఆర్ఎస్ జై.. రెబ‌ల్స్ బెడ‌ద బాగానే ఉందే..?

హుజురాబాద్ ఎన్నికల తర్వాత అధికార టీఆర్ఎస్ పార్టీకి భయం బాగానే పట్టుకుంది.ఏ మాత్రం అ జాగ్రత్తగా ఉన్నా టీఆర్ఎస్ అసంతృప్తి నేతలు పార్టీలు మారుతారని అధిష్టానం ఇప్పటికే గుర్తించింది.

 Trs Jai For Camp Politics Rebels Are Fine Trs, Mlc Elections-TeluguStop.com

అయితే, కేసీఆర్ నియంతృత్వ పోకడల వలన రాష్ట్రంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, సర్పంచులు గులాబీ పార్టీ అధినేతపై ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ బాస్‌‌కు గట్టి బుద్ధి చెప్పాలని భావించినట్టు తెలుస్తోంది.

ఈ విషయాన్ని ముందే గుర్తించిన కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది.ఎలాగైనా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టునిలుపుకోవాలని భావించిన గులాబీ లీడర్లు ఏకంగా క్యాంపు రాజకీయాలకు తెరలేపారు.

రాష్ట్రంలో ఇటీవల 19 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి.MLA కోటాలో ఆరు.లోకల్ బాడీ కోటాలో 12 స్థానాలు, గవర్నర్ కోటాలో ఒక స్థానానికి ఖాళీ ఏర్పడింది.MLA కోటాలో ఆరు, గవర్నర్ కోటాలో ఒక స్థానానికి ఇప్పటికే నియామకాలు పూర్తి అయ్యాయి.

లోకల్ బాడీ కోటాలో 12 ఖాళీలకు గాను 6 స్థానాలను టీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవంగా సొంతం చేసుకుంది.మరో 6 చోట్ల ఈనెల 10న ఎన్నికలు జరుగనున్నాయి.

అయితే, ఈసారి టీఆర్ఎస్ పార్టీకి రెబల్స్ బెడద ఎక్కువైంది.గతంతో గులాబీ బాస్ ప్రామిస్ చేసి నెరవేర్చకపోవడంతో వారంతా ఇప్పుడు షాక్ ఇచ్చేందుకు ఎన్నికల బరిలో నిలిచారు.

Telugu Cm Kcr, Congress, Mlc, Tg-Telugu Political News

ఇకపోతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక ప్రజాప్రతినిధులను కాపాడుకునేందుకు టీఆర్ఎస్ నేతలు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.బీజేపీ, కాంగ్రెస్ నేతలు వీలైనంత తొందరగా టీఆర్ఎస్ నేతలను ప్రలోభాలకు గురిచేస్తుండగా.ఎమ్మెల్సీ స్థానాలు చేజారిపోతాయని భావించిన మంత్రులు, ఎమ్మెల్యేలు క్యాంపు రాజకీయాలకు తెరలేపారు.ఏకంగా బస్సులు మాట్లాడి వారందరినీ నార్త్ ఇండియా, సౌత్ ఇండియా టూర్లకు పంపించారు.వీరంతా ఏకంగా డిసెంబర్ 10 పోలింగ్ టైంకు వచ్చి ఓట్లు వేసి వెళ్లిపోతారు.కాగా, టీఆర్ఎస్ పార్టీ తమ సొంత నేతలను కూడా నమ్మడం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube