ఈటెలపై టీఆర్ఎస్ భారీ వ్యూహం... బీజేపీకి కేసీఆర్ ఝలక్ ఇవ్వనున్నాడా?

టీఆర్ఎస్ పార్టీకి హుజూరాబాద్ నియోజకవర్గం కంచుకోట అన్న విషయం మనకు తెలిసిందే.అయితే బీజేపీ ఇప్పటికే మొదటి విడత ప్రచారం చేసి రెండో విడత ప్రచారంలో భాగంగా పాదయాత్రను కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది.

 Trs Is A Huge Strategy On Etela Will Kcr Give A Jolt To Bjp-TeluguStop.com

అయితే ఇప్పుడు హుజూరాబాద్ లో టీఆర్ఎస్ కు అసలు సిసలైన ప్రత్యర్థి బీజేపీ అనేది సుస్పష్టం.అయితే బీజేపీని నిలువరించడానికి కెసీఆర్ చేయాల్సిన ప్రయత్నాలు, వ్యూహాలన్నింటినీ ప్రయోగిస్తున్న పరిస్థితి ఉంది .ఇందులో భాగంగానే దళిత బంధు పధకాన్ని కూడా హుజూరాబాద్ నుండే ప్రారంభించాలని యోచించిన విషయం తెలిసిందే.అయితే త్వరలో ఈ పధకం ప్రారంభోత్సవంలో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థిని కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

అయితే హుజూరాబాద్ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.అయితే ప్రవీణ్ కుమార్ అభ్యర్థిత్వంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ ప్రవీణ్ కుమార్ రాజీనామా వెనుక హుజూరాబాద్ ఉప ఎన్నిక అభ్యర్థిత్వం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.

 Trs Is A Huge Strategy On Etela Will Kcr Give A Jolt To Bjp-ఈటెలపై టీఆర్ఎస్ భారీ వ్యూహం… బీజేపీకి కేసీఆర్ ఝలక్ ఇవ్వనున్నాడా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu @cm_kcr, Bjp, Bjp Party, Etela Rajender, Huzurabad By Poll, Kcr Strategy On Huzurabad, Retired Ips Praveen Kumar, Telangana Politics, Trs, Trs Huzurabad Candidate-Political

అయితే టీఆర్ఎస్ వేసిన దళిత బంధు వ్యూహం, దళిత అభ్యర్థి వ్యూహం ఫలిస్తే హుజూరాబాద్ లో టీఆర్ఎస్ కు ఎదురులేదనే చెప్పవచ్చు.హుజూరాబాద్ లో టీఆర్ఎస్ కు ఉన్న బలానికి తోడు, ప్రవీణ్ కుమార్ బలం తోడైతే ఈటెలకు కొంత ఇబ్బందికర వాతావరణం ఎదురవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

#KcrStrategy #Bjp Party #TRSHuzurabad #@CM_KCR #RetiredIps

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు